ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో అదరగొట్టేస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్..!!

ఒక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం.. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే ట్రైలర్ మధ్యలో కాస్త యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించి ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నితిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ కూడా నటించారు.

ముఖ్యంగా ఇందులో రావు రమేష్ కామెడీ టైమింగ్ నితిన్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తున్నాయి.చివరిలో రాజశేఖర్ స్పెషల్ అపీరియన్స్ గా కూడా ఆకట్టుకున్నరు.జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజశేఖర్ నితిన్ తో మాట్లాడే అప్పుడు కూడా కామెడీ డైలాగులను పూజించారు ముఖ్యంగా జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరు చెప్పినా వినను అంటూ చెప్పే డైలాగ్ నితిన్ మధ్య రాజశేఖర్ మధ్య కామెడీని బాగా పండించాయి.

ఇక ట్రైలర్ కామెడీతో మొదలై కామెడీతోనే ముగుస్తుంది మధ్యలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్టుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ లీల కూడా ఇందులో చాలా తక్కువగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సరదాగా సాగిపోయో ఒక ఫ్యామిలీ డ్రామాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.వరుస ప్లాపులతో సతమతమవుతున్న నితిన్ కు ఈ సినిమా ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.