హరోం హర టీజర్ తో సక్సెస్ కొట్టేలా ఉన్న సుధీర్ బాబు..!!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రి ఇచ్చిన సుధీర్ బాబు కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. గత కొంతకాలంగా వరుస సినిమాలతో డిజాస్టర్ లను మూటగట్టుకుంటున్న సుధీర్ అభిమానులను సైతం నిరాశ పరుస్తూనే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన మామ మచ్చింద్ర సినిమా కూడా డిజాస్టర్ గాని మిగిలింది. ఇప్పటివరకు ఎలాంటి పాత్రలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్ బాబు కటౌట్ కి తగ్గట్టుగా మాస్ సినిమా ఇప్పటివరకు పడలేదని చెప్పవచ్చు.

సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ కి ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు.వారందరి కోరిక మేరకే తాజాగా హరోం హర అనే సినిమాతో తీర్చబోతున్నారు. కాసేపటి క్రితమే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాతో సుధీర్ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ అంత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ త్రిల్లర్గా తెరకెక్కించబోతున్నట్లు ఈ టీజర్ చూస్తూ ఉంటే అర్థమవుతోంది.

ముఖ్యంగా గన్నుతో చెప్పే డైలాగ్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది టీచర్ తో అంచనాలు పెంచేస్తున్న సుదీర్ బాబు హరోం హార లో సునీల్ కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు కం బ్యాక్ ఇస్తారేమో చూడాలి మరి.. పాన్ ఇండియా లెవెల్లో మొదటిసారి ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా మాలవిక శర్మ నటిస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.