దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
ఇక దీని తరువాత మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో హృతిక్ రోషన్ ఓ కీలకపాత్రలో తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలోనే హృతిక్ రోషన్, రాజమౌళి బాహుబలి సినిమాలో చేయాల్సి ఉంది. ఏవో కారణాలతో ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు హృతిక్.
ఇక గతంలో రాజమౌళిని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు ఆయన సినిమాల్లో ఒక చిన్న పాత్ర నటించడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. ఆ రేంజ్ లో రాజమౌళి సక్సెస్ అందుకున్నాడు. అందుకే జక్కన్న కూడా వాళ్ల కోరిక మేరకు బాలీవుడ్ స్టార్లను తమ సినిమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఆ ఇండస్ట్రీ నుంచి కూడా తమ సినిమాకు కావలసిన హైప్‌ను దక్కించుకుంటున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో పలు ఇండస్ట్రీ లోకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీలు అంతా కనిపించబోతున్నారట.