న‌టుడు రాఘవ లారెన్స్ చిన్న వ‌య‌స్సులో అలాంటి భయంకర వ్యాధితో ఇబ్బందిప‌డ్డారా..?!

యాక్ట‌ర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. తెలుగు, తమిళ్ సినిమాల్లో మంచి క్రేజ్‌తో కొనసాగుతున్న రాఘవ లారెన్స్.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. మొదట కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్ తరువాత డైరెక్టర్‌గా, యాక్టర్‌గా అంచలంచలుగా ఎదుగుతూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న లారెన్స్ ఎంతో మంది చిన్నారులను మంచి భవిష్యత్తు అందిస్తున్నాడు. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చాలామందికి ఉచితంగా ఆపరేషన్ చేయించాడు.

Raghava Lawrence on X: "Hi dear Friends and Fans..! This picture was taken  when I was 12 year old in Thalaivar Fans club. The care and love I had for  him from

ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం ఎంతోమందికి పునర్జన్మను కల్పిస్తున్న లారెన్స్ తన చిన్న వయసులో ఎంతో ప్రమాదకరమైన వ్యాధితో బాధపడ్డాడట. లారెన్స్ చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనే భయంకరమైన వ్యాధికి గురయ్యారని.. ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం తన తల్లిదండ్రులు ఎన్నో చోట్ల ట్రీట్మెంట్ చేయించిన ఆ ప్రాబ్లం మాత్రం నయం కాలేదని.. ఆ టైంలో లారెన్స్ తల్లి రాఘవేంద్ర స్వామిని కొలిచేదని.. రాఘవేంద్ర స్వామిని కొలిచిన తరువాతే ఆ సమస్య తగ్గడంతో రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు వల్లే తను అటువంటి వ్యాధి నుంచి బయటపడ్డాడని తెలుస్తుంది.

Raghava Lawrence orphanage | 18 children from Laxmmi Bomb director Raghava  Lawrence's orphanage test positive for coronavirus

దీంతో లారెన్స్ తన పేరు పక్కన రాఘవ అనే పేరును చేర్చుకొని రాఘవ లారెన్స్ గా మారిపోయాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడిన లారెన్స్ ఆ వ్యాధి నుంచి కోల్పోవడంతో రాఘవేంద్ర స్వామి పై ఆయనకు కూడా నమ్మకం కలిగిందట. అప్పటి నుంచి లారెన్స్ కూడా రాఘవేంద్రను పూజించడం, రాఘవేంద్ర స్వామి మాల వేసుకోవడం చేస్తున్నాడట. ఇక తన తల్లినిఫూర్తిగా తీసుకున్న లారెన్స్ ట్ర‌స్ట్‌ను ప్రారంభించి ఎంతో మందికి పునర్జన్మను కలిపేస్తున్నాడు. అయితే చిన్నప్పుడు రాఘవ లారెన్స్ అంత భయంకరమైన వ్యాధిని అనుభవించాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.