డైరెక్టర్ సందీప్ రెడ్డి.. నాగార్జున మూవీలో నటించాడని మీకు తెలుసా..?!

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్.. ప్రస్తుతం యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోకి రాకముందు నటుడిగా ఓ క్రేజీ సినిమాలో నటించాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. గతంలో సందీప్ రెడ్డి వంగ నాగార్జున హీరోగా నటించిన ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.

Watch Kedi | Prime Video

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో..? ఒకసారి చూద్దాం. గతంలో నాగార్జున హీరోగా కేడి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. 2017లో రిలీజ్ అయిన సినిమా డైరెక్టర్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా నాగ్ హోమ్ బ్యాన‌ర్ కామాక్షి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కింది. మమతా మోహన్దాస్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఓ సీన్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా కనిపిస్తాడు.

Kabir Singh' director Sandeep Reddy Vanga says he was misquoted in his  recent interview | Hindi Movie News - Times of India

బోర్డు సన్నివేశాల్లో సందీప్ రెడ్డి కనిపిస్తున్నట్లుగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న సందీప్ రెడ్డి పోలీసులు రావడంతో అలాగే బోటులో దాక్కొని ఉంటాడు. అయితే పోలీసులు గన్ ఫైర్ చేయగానే తనకు తగిలినట్టు ఆ వీడియో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అప్పుడు సందీప్‌కు ఇప్పుడు సందీప్‌కు చాలా డిఫరెన్స్ ఉందని.. ఇప్పుడు చాలా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.