స్టార్ఇమేజ్ వ‌చ్చాక నాకు నేనే స్టార్ అని చెప్పుకునే రకం కాదు.. నితిన్ సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఫుల్ స్వింగ్లో చేస్తున్న నితిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానం గురించి యాంకర్‌కి వివరించాడు. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.. నేను ఆయన ఫ్యాన్ ని.. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలోనే కాదు నాకు చాలా సినిమాల్లో ఆయన రిఫరెన్స్ కచ్చితంగా ఉంటుంది.

Satwik Pvnr (@PvnrSatwik) / X

అది కావాలని చేసింది కాదు.. అండ్ పవన్ కళ్యాణ్ పేరును చాలా మంది సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు.. కానీ వాళ్ళు చెప్పరు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అని చెప్పుకుంటాను అంటూ నితిన్ వివరించాడు. ఈ మాటలకి యాంకర్ చాలామంది పవన్ కళ్యాణ్ పేరుని స్టార్టింగ్ లో వాడుకున్న స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత నేను ఆ హీరో ఫ్యాన్ ని అని ఓపెన్ గా చెప్పరు. మీరు మాత్రం ఇప్పటికి అలానే ఉన్నారు అనడంతో.. నితిన్ నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. మొదటి నుంచి అభిమాన హీరోని.. స్టార్ ఇమేజ్ వచ్చాక కూడా అలానే అభిమానిస్తా అంటూ వివరించాడు.

Allu Arjun wishes Pawan Kalyan a happy birthday with this adorable picture | Filmfare.com

అంతేకానికేరా స్టార్టింగ్ లో ఆయన పేరు వాడుకుని ఇమేజ్ వచ్చిన తర్వాత నాకు నేనే స్టార్ అని చెప్పుకునే రకం నేను కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. నితిన్ మాట్లాడింది అల్లు అర్జున్ గురించి అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్. బ‌న్నీ కూడా కెరీర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ పేరును చాలా సార్లు వాడుకున్నాడు. అయితే స్టార్ గా ఎదిగిన తరువాత చెప్పను బ్రదర్ అనే ఒకే ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యన డిఫరెన్సెస్ మొదలయ్యాయి. తర్వాత పవన్, అల్లు అర్జున్ కలిసి కనిపించినప్పటికీ ఆ గొడవలు మాత్రం అలానే ఉన్నాయి.