అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..పెళ్లి డేట్ ప్రకటించిన తమన్నా..ఆ స్పెషల్ డేనే..!?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ మరికొద్ది గంటల్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అర్జున్ కూతురు ఐశ్వర్య ..ఆ తర్వాత వెంకటేష్ కూతురు ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఇలా ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు .

ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె ఎవరో కాదు తమన్నా. ఎస్ అభిమానులకు తమన్న బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతుందట . విజయ్ వర్మతో ఇప్పుడే పెళ్లి చేసుకోను అంటూ చెప్పిన తమన్నా.. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట .

నవంబర్ 17వ తేదీ తన నివాసంలో చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుందట . అంతేకాదు మార్చి ఆఖరి వారంలో వీళ్ళ పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులకి ఇది నిజంగానే బిగ్ సర్ప్రైజ్ అంటూ తమన్నాకు విషెస్ అందజేస్తున్నారు..!!