తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ప్రశాంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాలుగా వరుసగా లేడీ కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అవుతూ వస్తున్న ఈ సీజన్‌లో తాజాగా ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. నిన్నటి ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో సందీప్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సందీప్ తన ఎలిమినేషన్ పై స్పందిస్తూ నేను ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం మొదటి ఏడు వారాలు నామినేషన్ లో లేకపోవడం అంటూ వివరించాడు.
హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మొదటి 5 వారాలు నాకు ఇమ్యూనిటీ వచ్చింది. బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇది మొదటిసారి. ఆరో వారం నుంచి నేను నిజాయితీగా ఆడను ఇంట్లో హౌస్ మేట్స్ అందరితో కలిసిమెలిసి ఉంటున్న. ఇక అప్పటి సిచువేషన్ బట్టి హౌస్ మెట్ల మధ్యన గొడవలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. అమర్, అర్జున్ నా వాళ్ళు అనుకున్నాను. కానీ వారిద్దరూ నాకు ద్రోహం చేశారు. నాతో ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచారు. నేను వారిని నమ్మడం వల్ల ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ ఇద్దరివల్లన నేను మోసపోయానని నా వెనుక వారిద్దరు దొంగాట ఆడారని వివరించాడు. వాళ్ళిద్దరినీ నమ్మకుండా ఉండాల్సింది అంటూ సందీప్ చెప్పకొచ్చాడు. ఇక ఈ సీజన్ ఉల్టా పల్టా సీజన్.. ఎవరు ఎప్పుడు ఉంటారు.. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియదు. ఏమో మేబీ నేను మళ్లీ ఇంట్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. త్వరలోనే నేను మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ తో ఇంట్లోకి వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ సందీప్ వివరించాడు. ప్రస్తుతం సందీప్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.