మహానటి సావిత్రి గా అనసూయ…ఎక్సపోసింగ్ చేసినంత ఈజీ కాదు అంటున్న నెటిజన్లు.

తెలుగు బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఒకరు అనసూయ భరద్వాజ్. ఈ టీవీ లో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ, ఆ తరువాత సినిమాలలో ప్రవేశించి మంచి అవకాశాలను సొంతం చేసుకుంది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం చిత్రంలో విలన్ గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె చాలా సినిమాలలో నటించింది. రంగస్థలం లో రంగమ్మతగా అనసూయ, తన నటనతో మరోసారి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తాజాగా ఈమె ప్రేమ విమానం అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం త్వరలో ఓ టి టి లో ప్రసారం కాబోతోంది.

అనసూయ సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా లో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఆమె పై వచ్చే ట్రోల్ల్స్ కి కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఇప్పటికే ఈమె అనేక వివాదాలలో కూడా చిక్కుకుంది. ఆ మధ్య హీరో విజయ్ దేవరకొండ పై ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి, వార్తలలోకెక్కిన విషయం మనందరికీ తెలిసినదే. అప్పుడు విజయ్ ఫాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ల్స్ చేసారు. కానీ అనసూయ మాత్రం అస్సలు వెనక్కి తగ్గకుండా, గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఇలా అప్పుడప్పుడు నెటిజన్లు ఆమె పోస్టులకు పెట్టె కామెంట్లకు రిప్లై ఇస్తూ ఉంటుంది అనసూయ.

తాజాగా అనసూయ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలకు ఒక వ్యక్తి ఇచ్చిన కామెంట్ కు ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చింది అనసూయ. అనసూయ తాజాగా పాత తెలుగు హీరోయిన్లలాగా ముస్తాబయ్యి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. “చాలా అందంగా ఉన్నారు. అచ్చం సావిత్రి గారిలా ఉన్నారు.” అని ఒకరు కామెంట్ చేస్తే, “ఎక్సపోసింగ్ చేసినంత ఈజీ కాదు సావిత్రి గారిలా నటించడం” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేసాడు. ఈ కామెంట్ కు అనసూయ స్పందిస్తూ, “నిజమే చెప్పారండి..సావిత్రి గారిలా నటించడం ఎవరితరం కాదు. నేను కేవలం ట్రిబ్యూట్ ఇచ్చానంతే. అలాగే ఎక్సపోసింగ్ చెయ్యడం కూడా అంత సులభం కాదు. శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రిపేర్ అవ్వాలి. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా, మన పనిని సంకల్పంతో చెయ్యాలి” అంటూ సున్నితంగానే చురకలు పెట్టింది.