ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్.. దండం పెట్టి రిజెక్ట్ చేసిన బాలయ్య..!!

సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ కు ఎలాంటి స్టార్ పొజిషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . కాగా ఆయన వారసులుగా ఇంట్రెస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ సూపర్ డూపర్ హిట్ నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు. అంతేకాదు నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఎన్టీఆర్ ఏకంగా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని స్టార్ హీరోల్లో ఒకరుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

అయితే వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా అయినా వస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక . ఓ డైరెక్టర్ అలాంటి సాహసమే చేశాడు . వంశీ పైడిపల్లి వీళ్ల ఇద్దరిని పెట్టి ఓ సినిమా తీయడానికి చాలా ట్రై చేశారు . అయితే ఎన్టీఆర్ తో నటించడం బాలకృష్ణ కు ఇంట్రెస్ట్ లేదో.. లేకపోతే నిజంగానే కాల్ షీట్ లు అడ్జస్ట్ చేయలేదో తెలియదు కానీ ఆ సినిమా రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా మరేదో కాదు ” బృందావనం”.

ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కోసం ముందుగా బాలకృష్ణను అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే అప్పటికే వేరే సినిమాలో బిజీగా ఉన్నారని కాల్ షీట్స్ లేవని కామన్ రీజన్ చెప్పి రిజెక్ట్ చేసారట . అంతేకాదు మరో మంచి కథతో వస్తే కచ్చితంగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాను అంటూ చేతులెత్తి దండం పెట్టి మరి చెప్పారట . దీంతో వంశీ పైడిపల్లి సైతం షాక్ అయిపోయారట. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్గా ట్రెండ్ అయింది . ఈ విషయాని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు..!!