అన్నీ ఉన్న ఆ ఒక్కటి లేక ఫెయిల్యూర్ గా మిగిలిపోయిన హీరోయిన్స్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే అందం అభినయంతో పాటు అదృష్టం కూడా కాస్త కలిసి ఉండాలి..ఇందులో ఏ కొంచెం తక్కువ అయినా సరే ఇండస్ట్రీలో రాణించడం మాత్రం చాలా కష్టమని చెప్పవచ్చు. అలా సినీ ఇండస్ట్రీలో అందం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేక సినిమాలంటే ఇష్టం ఉన్నప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్లు సైతం ఇప్పటికి ఎంట్రీ ఇస్తున్నారు.

మరి కొంతమందికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే అదృష్టం లేక సతమతమవుతున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటివారిలో మొదటగా హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దాదాపుగా పదేళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న ఈ ముద్దు గుమ్మ కథల ఎంపిక విషయంలో ప్రాజెక్టు ఎంచుకోలేక చాలా సతమతమవుతోంది.ఒకానొక సమయంలో అవకాశాల కోసం జీరో సైజ్ బాడీని కూడా మెయింటైన్ చేసిన అదంతా వృధా అయిపోయింది.

I feel right at home in Tollywood: Nabha Natesh | Telugu Movie News - Times  of India

ఇక మరొక హీరోయిన్ నభా నటేశా… బొద్దుగా ఉన్నప్పటికీ ముద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం అవకాశాల కోసం గ్లామర్ను సైతం వలకబోస్తోంది. నిధి అగర్వాల్ నటించిన చిత్రాలు పర్వాలేదు అనిపించుకున్న ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ రాలేకపోయింది హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోవడంతో ఈ అమ్మడి ఆశలు నిరాశగా మిగిలాయి. మరొక హీరోయిన్ నివేద పేతురాజు.. ఆకట్టుకునే నటన అందం ఉన్నప్పటికీ సక్సెస్ కాలేక పోయింది చివరిగా దాస్కా థంకి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న మళ్ళీ అవకాశాలు రాలేదు. మరొక హీరోయిన్ మెహ్రీన్ చివరిగా ఎఫ్ త్రీ సినిమాలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వీరంతా అవకాశాలు లేక పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.