ఇన్నేళ్ల నాగార్జున కెరీర్ లో ..చేతులారా వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు.. ఆయన తర్వాత అక్కినేని నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ లోనే మన్మధుడుగా పేరు తెచ్చుకుని నాగార్జున శివ సినిమాతో టాలీవుడ్‌కు కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశాడు.

అదే విధంగా నాగార్జునతో పాటు స్టార్ హీరోలుగా ఉన్న బాలకృష్ణ, చిరంజీవిలతో పోల్చితే నాగార్జునకు హిట్ సినిమాలు చాలా తక్కువ.. అయితే నాగార్జున తన కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు.. అలా నాగార్జున వదులుకున్న ఆరు సూపర్ హిట్ సినిమాలు గురించి ఇక్కడ చూద్దాం.

I'm happy as both Chaitanya and Akhil have found soulmates: Nagarjuna -  Hindustan Times

ఘర్షణ:
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఘర్షణ’ సినిమాలో ముందుగా నాగార్జున,వెంకటేష్ లను అడగగా నాగార్జున అ స‌మ‌య‌నికి మల్టీ స్టారర్ సినిమాల‌లో నటించటానికి సిద్ధంగా లేకపోవటంతో మణిరత్నం ఇదే సినిమాని ప్రభు,కార్తీక్ తో తీసి సూపర్ హిట్ కొట్టాడు.

మౌన రాగం:
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘మౌన రాగం’ సినిమాలోకూడా ముందుగా నాగార్జున,వెంకటేష్ లతో క‌లిసి ఈ సినిమా చేయాలని భావించారు. ఈ సినిమాకి కూడా నాగార్జున నో చెప్పడంతో మణిరత్నం మోహన్,కార్తీక్ లతో తీసి హిట్ కొట్టాడు

దళపతి:
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాలో నాగార్జునకు అఫర్ ఇస్తే తిరస్కరించాడు. అప్పుడు ఆ పాత్రను అరవింద్ స్వామి చేసాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

Happy Birthday Nagarjuna: His love story with Lakshmi and Amala in pics

మెకానిక్ అల్లుడు:
అక్కినేని నాగేశ్వరరావు,చిరంజీవి కాంబినేషన్ లో బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమాలో చిరంజీవి పాత్రకు మొదట నాగార్జునను అడిగారు. నాగార్జున రిజెక్ట్ చేయటంతో ఆ అవకాశం చిరంజీవికి వచ్చింది.

కలిసివుందాం రా:
ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘కలిసివుందాం రా’ సినిమాలో మొదట నాగార్జున అనుకున్నారు. నాగార్జున రిజెక్ట్ చేయటంతో వెంకటేష్ చేసాడు. ఈ కుటుంబ కథ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిన విషయమే.

బద్రి:
బద్రి సినిమాని నాగార్జున డేట్స్ లేని కారణంగా రిజెక్ట్ చేసాడు. ఆ సినిమాని పవన్ కళ్యాణ్ చేసి ఎంతటి హిట్ ని అందుకున్నాడో తెలిసిన విషయమే కదా.

Annapurna Studios boss Akkineni Nagarjuna says he is not a bank defaulter -  IBTimes India

ఆహ:
నాగార్జున అలా మిస్ అయిన సినిమా ఆహా. జగపతిబాబు హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమాను నిర్మించాడు నాగార్జున. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశ పరిచింది.

రామాయణం:
పది సంవత్సరాల క్రితం నాగార్జునతో రామాయణం అనే సినిమా చేయాలని రామ్‌గోపాల్ వర్మ అనుకున్నాడు.. కానీ దీనికి నాగార్జున అసలు ఒప్పుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జున తన కెరీర్ లో ఈ సినిమాలే కాకుండా ఎన్నో హిట్ సినిమాలు కూడా కోల్పోయాడు.