బన్నీతో సినిమానా..? వద్దు బాబోయ్ వద్దు..దండం పెట్టేస్తున్న హీరోయిన్స్..ఎందుకంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్టులో ఉత్తమ జాతీయ నటుడిగా బన్నీ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్తింట వైరల్ గా మారింది. అయితే జాతీయ అవార్డు రావడంతో గ్లోబల్ స్థాయిలో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది . కానీ ఓ హీరోయిన్స్ మాత్రం ఆయనతో సినిమాలో నటించడానికి సిద్ధంగా లేరు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

బన్ని కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. ఇప్పటికే దాదాపు 80% షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెండు పాటలు కొన్ని సీన్స్ మిగతా షూటింగ్ అంతా పూర్తయిపోయింది . అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే సుకుమార్-బన్నీ ముగ్గురు హీరోయిన్స్ ను అనుకున్నారట . ముగ్గురు కూడా ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడం గమనార్హం. అయితే స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ వస్తే ఎవ్వరూ మిస్ చేసుకోరు .

కానీ ఆ హీరోయిన్స్ ఎందుకు వదులుకున్నారు అంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్ సుకుమార్ ఇస్తూ ఉండడమే . సాధారణంగా పాన్ ఇండియా సినిమా సినిమా అంటే ఐటమ్ సాంగ్ చేస్తే మూడు నాలుగు కోట్ల ఎక్స్పెక్ట్ చేస్తారు . కానీ సుకుమార్ కోటికి మించి అస్సలు ఇవ్వను అంటూ చెప్పుకొస్తున్నారట . దీంతో ఆ హీరోయిన్స్ ఈ సినిమా ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు చాలామంది బన్నీ స్పీడ్ కి మేము తట్టుకోలేం బాబోయ్ అంటూ హీరోయిన్స్ ఆయనతో డాన్స్ వేయడానికి సైతం భయపడిపోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!