ఆ టాలీవుడ్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ లయ..?

తెలుగు సినీ ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. గత ముపై ఏళ్ళ నుండి చూసుకుంటే అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు కూడా చాలామంది ఒక స్థాయికి మించి  ఎదగలేకపోయారు. ఐతే ఉన్నంతలో మిగతా వాళ్లతో పోలిస్తే లయ మెరుగనే చెప్పాలి. ఆమె నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్‌ హీరోతో కలిసి నటించింది . మిడ్ రేంజ్ హీరోలు చాలామందితో జట్టు కట్టింది. ఇండస్ట్రీ లో ఒక ఐదారేళ్లు లయా హవా బాగానే నడిచిందని చెప్పాలి.

కెరీర్ మంచి రేంజ్ కి వెళ్లే సమయం లోనే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకుని యుఎస్‌లో సెటిలైపోయింది ఈ విజయవాడ అమ్మాయి. ఆ తర్వాత పూర్తిగా సినిమాలను వదిలేసింది. ఆ మధ్య ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్ అంతా యుఎస్‌లోనే జరగడం, అందులో తన కూతురు ఒక ముఖ్య పాత్ర పోషించడంతో లయ చిన్న క్యామియో రోల్ లాంటిది చేసింది. కానీ మరే చిత్రంలోనూ నటించలేదు. పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల మధ్య సినిమాల కోసం ఇండియాకు వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి లేకపోవడం వల్లే పెళ్లి తర్వాత నటించలేదని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది లయ.


అయితే ఇప్పుడు మాత్రం ఒక సినిమాలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. నితిన్ హీరోగా నటిస్తున్న  సినిమా ‘తమ్ముడు’తో హీరోయిన్ లయ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందట. ఇందులో హీరో నితిన్ కి సోదరిగా లయ కనిపించనుందట. ఈ సినిమా లో లయ పాత్ర  కీలకమని తెలుస్తుంది. అందుకే సినిమాకు ‘తమ్ముడు’ అనే టైటిల్ కూడా పెట్టారని సమాచారం . ఈ సినిమా లో హీరోయిన్ గా ‘కాంతార’ సినిమా హీరోయిన్ సప్తమి గౌడ ని ఎంచుకున్నారట. ఈ కన్నడ బ్యూటీ ‘తమ్ముడు’ సినిమా తో టాలీవుడ్లోకి అడుగు పెట్టనుంది.