జగన్ ఓడితే ఎక్కువ పథకాలు..బాబు-పవన్ ప్లాన్.!

దేశంలో ఏ రాష్ట్రం అమలు  చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. పెన్షన్, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, వాహన నిధి, చేనేత, సున్నా వడ్డీ..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు జగన్ ప్రభుత్వం అందిస్తుంది.

కరోనా సమయంలో అన్నీ రాష్ట్రాలు ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో ఉన్నా సరే జగన్..టైమ్ దాటకుండా పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారు. అందుకే ఇప్పటికీ ప్రజలు జగన్‌కు అండగా నిలుస్తున్నారు. ఒకవేళ పొరపాటున జగన్ మళ్ళీ అధికారంలోకి రాకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. అటు వాలంటీర్ పోస్టులు, సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ జగన్‌నే గెలిపించాలని ప్రజలు చూస్తున్నారు.

కానీ జగన్‌ని ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు. ఈ సారి వైసీపీని ఓడించి తాము అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే వీరు వస్తే పథకాలు అమలు అవుతాయా? ఉద్యోగుల పరిస్తితి ఏం అవుతుందనే భయం కూడా ఉంది. అందుకే జగన్ ఓడిపోతే ఇంకా ఎక్కువ పథకాలు అమలు చేస్తామని బాబు, పవన్ చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ ఓ క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు వచ్చే ప్రతి పథకం అమలు అవుతుందా? అని గట్టిగా చెప్పడం లేదు.

అంతకుమించి పథకాలు వస్తాయని అంటున్నారు..కానీ ఈ పథకాలు అమలు అవుతాయా? అనేది చెప్పడం లేదు. అందుకే ప్రజలు సైతం చంద్రబాబు, పవన్‌లని నమ్ముతున్నట్లు కనిపించడం లేదు.