కావలిపై టీడీపీ ఫోకస్..వైసీపీ టార్గెట్‌గా లోకేష్.!

తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే ఉమ్మడి నెల్లూరు జిల్లాపై పట్టు సాధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టి‌డి‌పి లోకి వలసలు పెరగడం, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పిలోకి రావడం, అలాగే నారా లోకేష్ పాదయాత్ర జరగడం..ఈ అంశాలు టి‌డి‌పికి బాగా ప్లస్ అవుతున్నాయి. దీంతో నిదానంగా టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది.

ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న కావలి నియోజకవర్గంలో టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇదే సమయంలో లోకేష్..ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.  కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి ఒక అవినీతి అనకొండ అని, ప్రశాంతమైన కావలిని మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఫైర్ అయ్యారు. కావలి ఎమ్మెల్యే బినామీల పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారని, కప్పరాళ్లతిప్పలో గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాల భూమిని మురళీరెడ్డి అనే బినామీ ద్వారా కబ్జా చేశారని ఆరోపించారు.

అలాగే జగనన్న లేఅవుట్లకు భూ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, బినామీల ద్వారా ఎకరా రూ.10 లక్షలకు కొనుగోలు చేసి అదే భూమిని ప్రభుత్వానికి రూ.50 లక్షలకు విక్రయించారని ఆరోపించారు. అటు రోజుకు 300 లారీల గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, ఇక లేఅవుట్‌ వేస్తే ఒక్కో ఎకరాకు రూ.10-15 లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు.

ఇలా లోకేష్ ఆరోపణలు చేయడం కాదు..సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేలపై ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ అవుతుంది. ఇక ఇక్కడ టి‌డి‌పి పికప్ అవుతుంది. గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే అభ్యర్ధి విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.