అయ్యో గురూజీకి పూజ హెగ్డే మీద ఇంకా మోజుపోలేదా.. మళ్లీ..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ పూజ హెగ్డే.. పూజా హెగ్డే నటించిన చిత్రాలు ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతల సైతం ఎక్కువ మక్కువ చూపలేదు. దీంతో వచ్చిన అవకాశం కూడా చేజారి పోతున్నాయి. ఇక టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం పూజ హెగ్డేనా ఏదో ఒక సినిమాలో చిన్న పాత్ర అయినా సరే తనకోసం క్రియేట్ చేస్తూ ఉంటారు. దీంతో పూజ హెగ్డే త్రివిక్రమ్ మధ్య ఏదో సంబంధం ఉందంటూ పలువు రూమర్స్ కూడా వినిపించాయి.

Pooja Hegde in Mahesh Babu and Trivikram Srinivas film?

అంతేకాకుండా త్రివిక్రమ్ ఎక్కువగా పూజా హెగ్డే తోనే సినిమాలను తెరకెక్కించడంతో ఈ రూమర్లు మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో కూడా మొదట మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే అని అనుకోగా.. సెకండ్ హీరోయిన్గా శ్రీ లీలా అని అనుకున్నారు. ఇందుకోసం కొద్దిరోజు షూటింగ్ కూడా జరపడం జరిగింది. కానీ కొన్ని కారణాల చేత పూజ హెగ్డే ఈ సినిమా నుంచి తప్పించడం జరిగింది. మరొక హీరోయిన్ సంయుక్త మీనన్ పైన త్రివిక్రమ్ మనసుపడి ఆమెకు అవకాశం ఇచ్చారని వార్తలు కూడా వినిపించాయి

కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ రెడీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ సాంగ్ కోసం హీరోయిన్ పూజా హెగ్డేను సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన పలువురు నేటిజెన్లు సైతం త్రివిక్రమ్ కు పూజా హెగ్డే మీద ఇంకా మోజు తీరలేదేమో అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.