అది నా ఇష్టం.. ఏ గొట్టం నా కొడుక్కి సమాధానం చెప్పను.. ట్రోలింగ్ పై థ‌మ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ లో థ‌మ‌న్ ఒక‌డు. ప్ర‌స్తుతం తెలుగులో ఈయ‌న మ‌హేష్ బాబు `గుంటూరు కారం`, సాయి ధ‌ర‌మ్ తేజ్ `బ్రో`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఓజీ`, రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` చిత్రాల‌కు వ‌ర్క్ చేస్తున్నాడు. చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న థ‌మ‌న్ పై ఈ మ‌ధ్య కాలంలో ట్రోలింగ్ బాగా జ‌రుగుతోంది. ప్ర‌తి చిన్న విష‌యానికి థ‌మ‌న్ ను నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అలాగే క్రికెట్ మీద ఉన్న శ్రద్ద థ‌మన్ కి మ్యూజిక్ పైన లేదు అంటూ కొంద‌రు గ‌త కొద్ది రోజుల నుంచి ఆయ‌న్ను ట్రోల్ చేస్తున్నారు.

అయితే తాజాగా మీడియాతో ముచ్చ‌టించిన థ‌మ‌న్‌.. ట్రోలింగ్ పై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. `నాకు మద్యం, గర్ల్స్ ఫ్రెండ్స్ వంటి వ్యసనాలు లేవు. క్రికెట్ ఆడ‌టం నా హాబీ. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు వెళ్లి క్రికెట్ ఆడతా. అది నా ఇష్టం. పని మానేసి నేనెప్పుడూ క్రికెట్ ఆడను. అలా అని నా మీద ఏ నిర్మాతైనా కంప్లైంట్ చేశాడా.. లేదు కదా. అయినా ఏ గొట్టం నా కొడుక్కి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు` అంటూ థ‌మ‌న్ ఫైర్ అయ్యాడు.

అలాగే మ‌హేష్ `గుంటూరు కారం` నుంచి థ‌మ‌న్ ను త‌ప్పించార‌ని మొన్నామ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంపై కూడా థ‌మ‌న్ స్పందించాడు. అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మే అని.. ఎవరు వాటిని సృష్టించారో త‌న‌కు తెలియద‌ని..టీమ్ మొత్తం సమిష్టిగా పని చేస్తున్నామ‌ని థ‌మ‌న్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో థ‌మ‌న్ కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.