ర‌జనీకాంత్ కు ఘోర అవ‌మానం.. సూప‌ర్ స్టార్ విష‌యంలో ఇంత దారుణమా..?

rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హిట్ కొట్టి చాలా కాల‌మే అయిపోయింది. ప్ర‌స్తుతం ఈయ‌న `జైల‌ర్‌` మూవీ చేస్తున్నాడు. ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. రజ‌నీకాంత్‌ కెరీర్‌లో 169వ చిత్రమిది. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే మళయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.

గ‌త నెల‌లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే నెల‌లో విడుద‌ల కాబోతోంది. ఆగస్టు 10న జైల‌ర్‌ థియేటర్స్ లో సంద‌డి చేయ‌నుంద‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో బిజినెస్ కూడా ప్రారంభ‌మైంది. అయితే కోలీవుడ్ లో జైల‌ర్ కు బిజినెస్ భారీగానే జ‌రుగుతున్నా.. తెలుగులో మాత్రం మేక‌ర్స్ కు బిగ్ షాక్ త‌గిలింది.

జైలర్ సినిమా తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ. 11 కోట్లకు అమ్మాల‌ని మేకర్స్ ప్లాన్ చేయగా.. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం రూ. 5 నుంచి 6 కోట్ల‌కే అడుగుతున్నార‌ట‌. అంత‌కు మించి పెట్టాలేమ‌ని చెబుతున్నార‌ట‌. ఇది ర‌జ‌నీకాంత్ కు ఘోర అవ‌మానం అనే చెప్పాలి. గ‌తంలో ర‌జ‌నీకాంత్ సినిమాలు ఇక్కడ పాతిక కోట్ల రేంజ్ లో వ‌సూళ్లు రాబ‌ట్టిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఆయ‌న సినిమాను కేవ‌లం రూ. 6 కోట్ల‌కే కొట్టామ‌ని అన‌డం దారుణ‌మ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ, తెలుగులో ర‌జ‌నీకాంత్ కు ఒక‌ప్ప‌టి మార్కెట్ ఇప్పుడు లేదు. అందుకే ఆయ‌న సినిమాల‌ను ఎక్కువ పెట్టి కొని న‌ష్టాలు భరించడం ఎందుకని తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు.