అమెరికాలో అదిరిపోయే గిఫ్ట్ తో బాల‌య్య‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన అభిమాని.. ఇంత‌కీ ఆ కానుక ఏంటంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `భ‌గ‌వంత్ కేస‌రి` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

అయితే ఈ మూవీ షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొర‌క‌డంతో బాల‌య్య తన సతీమణి వసుంధర దేవి, మనవడితో కలిసి వెకేష‌న్ కోసం అమెరికా వెళ్లారు. న్యూ జెర్సీలోని జెఎఫ్ కె విమానాశ్ర యంలో బాలయ్యకు ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం ప‌లికిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అమెరికాలో తాజాగా ఓ అభిమాని అదిరిపోయే గిఫ్ట్ తో బాల‌య్య‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు. బాల‌య్య‌పై ఎంతో అభిమానంతో స‌ద‌రు అభిమాని ఓ బంగారు ఉంగ‌రాన్ని ప్ర‌త్యేకంగా చేయించి కానుక‌గా ఇచ్చాడ‌ట‌. సింహం గుర్తుతో ఉన్న ఆ బంగారు ఉంగరం బాల‌య్య‌కు చాలా బాగా న‌చ్చింద‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. మొత్తానికి బాలయ్యను అభిమానులు ఏ స్థాయిలో అభిమానిస్తారో చెప్ప‌డానికి ఇది ఒక నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.