`గుంటూరు కారం`కు మ‌హేష్ బాబు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్ గురూ!?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిత‌మవుతున్న ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాకు మ‌హేష్ బాబు తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే గుంటూరు కారం కోసం మ‌హేష్ బాబు ఏకంగా రూ. 78 కోట్లు ప్లస్ జీఎస్టీ ఛార్జ్ చేస్తున్నాడ‌ట‌. మ‌హేష్ బాబు కెరీర్ లోనే హైయ్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ ఇది.

పాన్ ఇండియా హీరోలు మాత్ర‌మే ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు. కానీ, ఎటువంటి పాన్ ఇండియా ఇమేజ్ లేక‌పోయినా మ‌హేష్ బాబు ఆ రేంజ్ లో ఛార్జ్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కొంద‌రు ఇది మ‌రీ టూ మ‌చ్ గురూ అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ సినిమాకే మ‌హేష్ బాబు ఇన్ని కోట్లు ఛార్జ్ చేస్తే.. ఇక రాజ‌మౌళితో చేయ‌బోయే త‌న త‌దుప‌రి చిత్రానికి ఏ స్థాయిలో తీసుకుంటాడో అని మ‌రికొంద‌రు ఆలోచ‌న‌ల్లో ప‌డ్డారు.