సీమలో లోకేష్ సక్సెస్ అయినట్లేనా..టీడీపీకి 30 ప్లస్ సాధ్యమేనా?

జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టారు. కుప్పం ఎలాగో టి‌డి‌పి కంచుకోట కాబట్టి అక్కడ ప్రజా స్పందన బాగా వచ్చింది. కానీ తర్వాత అనుకున్న విధంగా రాలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలో పాదయాత్ర హైలైట్ కాలేదు. ఆ తర్వాత నుంచి సీన్ మారింది. పీలేరు, నగరి, పలమనేరు లాంటి స్థానాల్లో భారీ స్థాయిలో పాదయాత్ర సక్సెస్ అయింది.

అలాగే లోకేష్ అన్నీ వర్గాల ప్రజలని కలుస్తూ, వారి సమస్యలని తెలుసుకుంటూ ముందుకెళ్లారు. ఈ అంశం టి‌డి‌పికి పెద్ద ప్లస్. ఇక చిత్తూరు, అనంతపురం,కర్నూలు, కడప..ఇలా నాలుగు జిల్లాల్లో పాదయాత్ర దిగ్విజయం సాగింది. కడపలోనే బద్వేలులో పాదయాత్ర ముగించుకుని ఇంకా నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ కాబోతున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర సీమలో సక్సెస్ అయిందనే చెప్పాలి. కాకపోతే సీమలో టి‌డి‌పికి ఇప్పటివరకు పెద్ద పట్టు లేదు. ఇప్పుడు అది కాస్త పెరిగింది.

కాకపోతే మూలాలకు వెళ్ళి..అక్కడ నుంచి టి‌డి‌పి బలం పెంచడంలో సగం మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇక అన్నీ వర్గాల ప్రజలని ఆకర్షించడంలో లోకేష్ విజయవంతం అయ్యారు. ఇదే ఊపు కొనసాగితే సీమలో టి‌డిపికి మంచి ఫలితాలు వస్తాయి. లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్..నాలుగైదు నెలల వరకు ఉంటుంది. అయితే దీన్ని ఎన్నికల వరకు  టి‌డి‌పి నేతలు కొనసాగించాలి. అప్పుడే సీమలో టి‌డి‌పి సత్తా చాటుతుంది.

గత ఎన్నికల్లో సీమలోని 52 సీట్లలో టి‌డి‌పి గెలిచింది 3 సీట్లే..ఆ మూడు సీట్లు కాస్త ఇప్పుడు 30 సీట్లు వరకు మార్చుకునే ఛాన్స్ ఉంది. అందుకు లోకేష్ పాదయాత్ర బాగా హెల్ప్ అవుతుంది. చూడాలి మరి ఎన్నికల్లో టి‌డి‌పి ఏ మేర సత్తా చాటుతుందో.