నటి తులసీతో రూమర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ శ్రీను..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా విలన్ గా ఎన్నో మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు ప్రభాస్ శ్రీను.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలపైనే అవుతోంది.ఇప్పటివరకు 300 కి చిత్రాలలో నటించి మెప్పించిన ప్రభాస్ శ్రీను రెబల్ స్టార్ ప్రభాస్ కు మంచి స్నేహితుడని తెలియజేస్తూ ఉంటారు… ఇండస్ట్రీలో తనకు అన్ని ప్రభాస్ తోనే ముందుగా తెలియజేస్తారని తెలిపారు. ఇదంతా ఇలా ఉంటే సీనియర్ నటి తులసి, ప్రభాస్ శ్రీను గురించి గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

Prabhas Srinu: ప్రభాస్ శ్రీను- తులసి వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి? - AP to TS
ప్రభాస్ శ్రీను, తులసి కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా వీరి మీద పలు రూమర్లు రావడం మొదలయ్యాయి.. కనీసం ఈ విషయం పైన ఖండించే ప్రయత్నం అయితే ఇంతవరకు చేయలేదు. కానీ తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను ఈ వార్తల పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తులసి గారితో తాను ఎక్కువగా సినిమాలు చేయలేదని కానీ మా మీద తరచూ పలు రకాల వార్తలు పత్రికలు రూమర్స్ వినిపిస్తున్నాయని తెలిపారు.. ఆవిడ నాకు తల్లితో సమానం డార్లింగ్ సినిమా సమయంలో ఆవిడను చాలా జాగ్రత్తగా చేసుకున్నాను.. ఆవిడ పెద్ద నటి ఎన్నో చూసి ఇస్తాయి కి వచ్చారు..

ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచేదాన్ని అలా అపార్థం చేసుకున్నారు మాపై రూమర్స్ వచ్చినప్పుడు మొదట ఆవిడే తనకు మెసేజ్ పెట్టారు.. ఏంటి ఇలా రాశారు మీ భార్యకు చెప్పు లేకపోతే తను అపార్థం చేసుకుంటుందేమో అంటూ తెలియజేసిందట నా భార్య ఒక డాక్టర్ ఆ రూమర్స్ చూసి ఇద్దరం కలిసి నవ్వుకున్నామని తులసి గారంటే నాకు చాలా గర్వం ఆమె ఎప్పుడూ పూజలకు సంబంధించిన మెసేజ్లు పెడుతుంది అంటూ తెలియజేశారు ప్రభాస్ శ్రీను.