ఇట్స్ అఫీషియ‌ల్‌.. విజ‌య్ వ‌ర్మ‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో త‌మ‌న్నా.. ఇంత‌కీ పెళ్లెప్పుడంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను జంటగా గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరు మ‌ద్దులు, హ‌గ్గుల‌తో రెచ్చిపోయారు. ఇక‌ అప్పటినుంచి వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారాన్నే ఇప్పుడు తమన్నా నిజం చేసింది. విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నానని ఎట్టకేలకు ఒప్పుకుంది. త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ తొలిసారి జంట‌గా `లస్ట్ స్టోరీస్‌ 2` వెబ్ సిరీస్ లో న‌టించారు. ఈ సిరీస్ షూటింగ్ స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఇదే విష‌యాన్ని త‌మ‌న్నా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

`కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నేను చాలా మంది హీరోలతో వ‌ర్క్‌ చేశాను. కానీ, విజయ్ వర్మ చాలా స్పెష‌ల్ గా అనిపించాడు. నాకు లైఫ్ లాంగ్‌ రక్షణగా నిలబడతాడనే నమ్మకాన్ని ఇచ్చాడు. మాది ఆర్గానిక్ బంధం. నా విష‌యంలో అత‌నెంతో కేర్ చూపిస్తాడు. న‌న్ను కిందకు లాగాని చూసే వారి నుంచి ర‌క్షిస్తాడు. నేను నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి విజయ్ వర్మ వచ్చేశాడు` అంటూ త‌మ‌న్నా చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇక త‌మ‌న్నా మాట‌లు బ‌ట్టీ చూస్తుంటే రేపో మాపో విజ‌య్ వ‌ర్మ‌తో పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.