సంయుక్త మాస్టర్ ప్లాన్ కి భయపడుతున్న స్టార్ హీరోయిన్స్.. ఏమైందంటే.?

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అలా అడుగుపెట్టిందో లేదో ఇలా వరుస విజయాలు అందుకొని భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకొని.. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకొని కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ అనే సినిమాలో ఈమె హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది.. ఇకపోతే తన ఖాతాలో హిట్లు పడ్డా.. ఆమెకు తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసినా.. స్టార్ చాన్సులు అందుకోవడంలో మాత్రం వెనుకబడింది అని చెప్పవచ్చు.

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, హీరో ధనుష్ సార్ వంటి చిత్రాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలతో నటించాలని అందుకు బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా వెనుకాడను అంటూ హింట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధం అని తెలిపింది. ఇకపోతే సంయుక్త పర్ఫామెన్స్ గురించి తెలిసిన దర్శక నిర్మాతలు స్టార్ హీరోల సినిమాలైనా సరే ఆమెకు ఒక మంచి పాత్ర ఉండేలాగా చూస్తున్నారట. ప్రస్తుతం సంయుక్త స్టార్ హీరోల సినిమాలలో అవకాశాల కోసం తనను తాను మార్చుకునేందుకు సిద్ధమవుతుందని సమాచారం.

Samyuktha Menon disappointed with Bheemla Nayak..? - TeluguBulletin.com

అన్ని విధాలుగా తనను తాను సిద్ధం చేసుకుంటున్న సంయుక్తాన్ని చూసి స్టార్ హీరోయిన్లు కూడా భయపడుతున్నారు అని.. దర్శకనిర్మాతలు ఆమెకే మొదటి ప్రాధాన్యత ఇస్తే ఇక తమకు అవకాశాలు కూడా మిగలవు అని భయపడుతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే సంయుక్తాకు వచ్చే అవకాశాలను బట్టి తెలుస్తుంది.