శ్రీ‌లీల‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టిన స్టార్‌ హీరో.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన యంగ్ బ్యూటీ!?

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకముందే.. ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ వంటి అగ్ర‌ హీరోల దగ్గర నుంచి వైష్ణవ్‌ తేజ్, నితిన్ వంటి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.

ప్రస్తుతం శ్రీ‌లీల చేతలో దాదాపు పది చిత్రాలు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీ‌లీలకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఇటీవల శ్రీ‌లీల‌కు ఓ సీనియర్ స్టార్ హీరో పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టాడ‌ట‌. ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఆ హీరోకు ఆల్రెడీ పెళ్ళై శ్రీ‌లీల వ‌య‌సున్న ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.

ఇంత‌కీ శ్రీ‌లీల‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టిన హీరో మ‌రోవ‌రో కాదు ర‌వితేజ‌. వీరిద్ద‌రూ జంట‌గా `ధ‌మాకా` మూవీలో న‌టించారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ర‌వితేజ‌, శ్రీ‌లీల‌కు మ‌ధ్య మంచి స‌న్నిహిత్యం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ర‌వితేజ శ్రీ‌లీల‌ను ఆట‌ప‌ట్టించేందుకు `న‌న్ను పెళ్లి చేసుకుంటావా..?` అని స‌ర‌దాగా ప్ర‌పోజ‌ల్ పెట్టార‌ట‌. అందుకు శ్రీ‌లీల మా మమ్మీని అడిగి చెబుతా అంటూ దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింద‌ట‌. అంతేకాదు, మీకు కోపం ఎక్కువ‌, మీతో నేను అడ్జ‌స్ట్ అవ్వ‌లేను, ఎందుకంటే నాకు కూడా చాలా కోపం అంటూ ర‌వితేజ‌నే తిరిగి ఆట‌ప‌ట్టించింద‌ట‌.

Share post:

Latest