టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె స్టార్ హీరోయిన్‌గా రాణించకపోయినప్పటికీ ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగల హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ హీరోయిన్ సినీ కెరీర్ లో ఎందరో హీరోలతో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించాయి. నిత్యమీనన్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎంతమంది హీరోలతో ఎఫైర్ కొనసాగించిందో ఇప్పుడు చూద్దాం.
ఇక నిత్యామీనన్ టాలీవుడ్‌కు అలా మొదలైంది అనే సినిమాతో ఎంట్రీ వచ్చింది.. సినిమా షూటింగ్ సమయంలోనే నిత్యా మీనన్ కి హీరో నాని మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు బయటికి వచ్చాయి. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్త కూడా వినిపించింది. అయితే అనూహ్యంగా నాని- అంజనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా నాని- నిత్యామీనన్‌ల ప్రేమ మధ్యలోనే ముగిసింది. ఆ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కూడా నిత్యామీనన్ ప్రేమలో పడిందట. అయితే అప్పటికే దుల్కర్ కి పెళ్లి అయిపోయిందట. నిత్యామీనన్- దుల్కర్ ప్రేమ విషయం తెలుసుకున్న ముమ్ముట్టి ఎలాగైనా నిత్యామీనన్ కి తన కొడుకుతో ఉన్న బంధాన్ని విడగొట్టాలని ప్రయత్నించారు.
వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా మధ్యలోనే ముగిసింది. ఆ తర్వాత తెలుగులో నితిన్ తో కలిసి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో నటించే సమయంలోనే నితిన్, నిత్యామీనన్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే వీరి పెళ్ళికి నితిన్ అక్క నికిత రెడ్డి ఒప్పుకోలేదట.. దాంతో వీరి ప్రేమ కూడా మధ్యలోనే బ్రేకప్ అయింది. ఆ తర్వాత మరో యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా సమయంలోనే శర్వానంద్- నిత్యమీనన్ మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.. ఆ రిలేషన్‌తో వీరిద్దరూ పబ్బులు, పార్టీలంటూ తిరుగుతూ టాలీవుడ్ లోనే ఒకసారి హాట్ టాపిక్ గా మారారట.
అయితే ఆ తర్వాత మధ్యలో ఏమైందో కానీ నిత్యామీనన్ కన్నడ స్టార్ హీరో సుదీప్ కు జంటగా కలిసి ఓ సినిమా చేస్తున్న సమయంలో సుదీప్ తో ప్రేమలో పడిందని వార్తలు బయటికి వచ్చాయి. ఈ ఇద్దరు రెండు సంవత్సరాలపాటు డేటింగ్ లో ఉన్నారట. అంతేకాదు సుదీప్ తన భార్యకి విడాకులు ఇచ్చి నిత్య మీనన్‌ని రెండో పెళ్లి చేసుకోవాలని కూడా భావించారట. అయితే ఈ విషయం తెలుసుకున్న సుదీప్ కూతురు కన్నడ చిత్ర పరిశ్రమ పెద్దలను కలిసి నిత్య మీనన్ కి వార్నింగ్ ఇప్పించిందట. దాంతో వీరి ప్రేమ అక్కడితో ముగిసింది. ఈ విధంగా నిత్యమీనన్ తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు చాలామంది హీరోలతో ప్రేమాయణం నడిపించింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో నిత్య మీనన్ కి మాత్రమే తెలుసు.