ర‌ష్మిక స్టార్ హీరోయిన్‌గా మారడానికి ఆ హాట్ హీరోయిన్ కారణమని మీకు తెలుసా..!

నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జంటగా పుష్ప2 సినిమాలో నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. అలాగే బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ కపూర్ కు జంటగా యానిమల్ సినిమాలో నటిస్తుంది.

Rashmika Mandanna Looks Oh So Sexy In Beige Outfit, Proves She Is Called 'National Crush' For a Reason

ఈ సినిమాలతో పాటు రష్మిక `రెయిన్ బో` అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే అవటం మరో విశేషం. ఇక ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే రష్మిక ఇంత బిజీ హీరోయిన్‌గా ఉందంటే అందుకు ప్రధాన కారణం మరో యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్‌గా మారిందట.

A1 Express Movie Actress Lavanya Tripathi Glamorous Photos

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమాలో నటించింది. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హీట్ అవ్వటమే కాకుండా విజయ్‌- రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హోదాను అందుకొని యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు స్టార్ హీరోలతో వరుస‌ సినిమాలు క్యూ కట్టాయి.

New Star Vijay Devarakonda Needs a Fresh Face - Rashmika Mandanna

అయితే అసలు విషయం ఏమిటంటే రష్మిక నటించిన గీతాగోవిందం సినిమాకు మొదటి ఛాయిస్ ఆమె కాదట.. ముందుగా మేకర్స్ లావణ్య త్రిపాఠిని హీరోయిన్‌గా అడిగారట. కానీ ఆమె నో చెప్పడంతో రష్మికను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇదే విషయాన్ని లావణ్య త్రిపాఠి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విజయ్‌ సినిమా అంటే లిప్ లాక్ లు ఎక్కువగా ఉంటాయని భయంతో ఆ సినిమాకు నో చెప్పిందట. ఇక దాంతో ఈ సినిమాలో నటించే అదృష్టం రష్మికను వరించింది. ఒకవేళ లావణ్య త్రిపాఠి గీతాగోవిందం చేసుంటే ఆమె ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఉండేదని అనడంలో సందేహం లేదు.

Share post:

Latest