ఈ టాలీవుడ్‌ హీరోల పరిస్థితి మరీ దారుణం… సినిమాలు రిలీజ్ కాక ఇన్ని క‌ష్టాలా..!

ఇప్పుడు టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ హీరోల సినిమాల షూటింగ్‌లు పూర్తి చేయడం వారికి సులభంగానే ఉంది కానీ వాటిని విడుదల చేయడమే వారికి పెద్ద సవాల్‌గా మారింది. సరైన తేదీలు దొరక్క ఒకవేళ ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే అనుకోకుండా ఏదో ఒక పెద్ద సినిమా రావడం ఇలా వారికి ఎవరూ ఊహించని కష్టాలు వస్తున్నాయి. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ నటించిన బెదురులంక సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.

Young Heroes: కుర్రాళ్ళొస్తున్నారు.. వైష్ణవ్ తేజ్ నుంచి సంతోష్ శోభన్ వరకు  టాలీవుడ్‌లో యంగ్ తరంగ్.. | From Naveen Polisetty to Vaishhnav Tej these are  the young heroes doing wonders ...

ఇప్పటికే ఈ సినిమా ప్రింట్‌లు కూడా రెడీగా ఉన్నాయి. కానీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకురావాలో వారికి అర్థం కావడం లేదు. ముందుగా ఈ సినిమాను గత నెల 21న విడుదల చేయాలనుకున్నారు.. కానీ అదే సమయానికి మరో యువ హీరో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ ప్రేక్షకుల ముందుకు రావడంతో కార్తికేయ డ్రాప్ అయ్యారు.

Karthikeya: యు.ఎస్.ఎ.లో 'బెదురులంక 2012' సరికొత్త రికార్డ్! - NTV Telugu

ఇప్పుడు ఏప్రిల్‌లో వరుస‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అసలే ఇది కార్తికేయకు ఎంతో కీలకమైన సినిమా.. వరుస డిజాస్టర్‌ల తర్వాత తన మార్కెట్ పూర్తిగా దెబ్బతింది.. అందుకే తన ఆశలన్నీ ఈ సినిమా మీద పెట్టుకున్నాడు. మరో యువ హీరో బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సార్ ఇది కూడా ఇదే సమస్య. ఈ సినిమా మార్చ్ 10నే రావాల్సి ఉండగా.. పరీక్షలు కారణంగా వాయిదా వేశారు.. తీరా ఇప్పుడు చూస్తే ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే సూచనలు కనిపించడం లేదు.

Nenu Student Sir': Teaser of Bellamkonda Ganesh starrer to release on  November 12 | Telugu Movie News - Times of India

మరో యువ హీరో శ్రీ విష్ణు నటించిన సామజవరగమన ఏదో విధంగా మే 18న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ అదే రోజున మరో యువర్ హీరో సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే కూడా ఆ రోజునే రానుంది. ఇవన్నీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నవి.పెద్ద సినిమాలకు దారి ఇవ్వడం కోసం రాజీ పడినవి. ఏదోలా రిలీజ్ చేయడం సంగతి ఎలా ఉన్నా జనాన్ని థియేటర్లకు రప్పించడం చాలా క‌ష్టం.

ఇక పాజిటివ్ టాక్ వచ్చేదాకా కిందామీదా పడి ప్రమోషన్లు చేసుకోవడం ఇదో పెద్ద తతంగం. బాగున్న వాటిని ప్రేక్షకులు ఆదరించడంలో అనుమానం లేదు కానీ పెద్ద బ్యానర్ల అండ లేని వాటిని ఓ రెండు వారాలు థియేటర్లలో ఉండేలా చేసుకోవడం కత్తిసాములా మారిపోయింది. అసలే మండే ఎండలు. వీటికి తోడు ఇలాంటి సమస్యలు. కుర్ర హీరోల చిక్కులు అన్నీ ఇన్నీ కావు.