వారెవ్వ: రెండో సినిమాకే జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ‘దసరా’ డైరక్టర్.. నెక్ట్స్ సినిమా ఏ హీరోతో అంటే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా డైరెక్టర్ శ్రీకాంత్ ఈదెల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దాని అంతటికి కారణం ఒకే ఒక్క సినిమా దసరా. కొత్త డైరెక్టర్ అయినా సరే సూపర్ గా స్క్రీన్ స్పేస్ ని కవర్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను డైరెక్ట్ చేశాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన రీసెంట్ సినిమా దసరా . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది .

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు రోజుల్లోనే 54 కోట్లు కలెక్ట్ చేసి నాని కెరియర్ లోనే సంచలన రికార్డును క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే ఫస్ట్ సినిమాకే ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలా తన నెక్స్ట్ సినిమాని ఏ హీరోతో చేయబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్ ఓదెల తన తర్వాత సినిమాని టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న అఖిల్ అక్కినేనితో కమిట్ అయ్యాడు అంటూ తెలుస్తుంది.

ఇప్పటికే కథను నాగార్జున – అఖిల్ కు వివరించాడని.. వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయ్యారని .. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా అయిపోయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమాని తెరకెక్కించే విధంగా శీకాంత్ ఓదెల స్టోరీ రాసుకున్నట్లు ఓ న్యుస్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఇది సంచలనంగా మారబోతుంది అనడంలో సందేహం లేదు..!!