సమంత మనసులో డ్రీమ్‌ హీరో.. మరోసారి ప్రేమలో పడిందా ఏంటి..!

స్టార్ హీరోయిన్ సమంత- నాగచైతన్యతో పెళ్లి తర్వాత.. విడాకులు ఇచ్చాక ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు సమంత ఏది మాట్లాడినా.. ఏం చేసినా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియా వరకు పెద్ద సంచలన విషయంగా మారుతుంది. సమంతా సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఇప్పుడు మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. నాగచైతన్య తో విడాకులు తర్వాత సమంత పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిల‌ విహరిస్తుంది. ఆమె ఏం చేసినా.. అడ్డు చెప్పే వారే లేరు.. ఆమె జీవితం ఆమె ఇష్టం.

Samantha Hot Photos Download / Item Song oo antava HD Images Latest  Wallpapers and PHOTOSHOOT update #SAMANTHA | Bollywood Vloge (FUN AND FACTS)

సినిమాల్లో తనకి ఇష్టమైన పాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. తాజాగా ఇప్పుడు తన మనసులో మరో హీరో ఉన్న విషయని స్వేచ్ఛగా మీడియ ముందు ప్రకటించింది. సమంత మనసులో ఉన్న అతడు ఆమెకు ఒక డ్రీమ్ హీరో.. మరి అతడు ఎవరో అనుకుంటున్నారా.. మలయాళీ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్.. సమంతకు ఈ హీరో విషయంలో ఓ తీరని కోరిక ఉందట.

Fahadh Faasil opens up about the accident he met with during the shoot of  'Malayankunju'; read here | Malayalam Movie News - Times of India

మలయాళంలో ఏదైనా ఒక సినిమా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఈ హీరో తేనే నటించాలని కోరిక ఉందని తాజాగా సమంత తన మనసులో మాటను బయట పెట్టింది. గతంలో ఈ హీరోతో ఒక సినిమా చేసిన.. అది చాలా చిన్న పాత్ర అవటంతో అది తనకు చాలదని అతనితో ఫుల్ లెన్త్ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని ఉందంటూ సమంత తన మనసులోని కోరికను బయటపెట్టింది. మలయాళంలో మీరు ఎప్పుడు సినిమా చేస్తారు అన్న ప్రశ్నకు.. సమంత స్పందిస్తూ తన డ్రీమ్ హీరో కోరికను బయటపెట్టింది.

ఏదో ఒక రోజు కచ్చితంగా మలయాళంలో సినిమా చేస్తానని.. ఆ సినిమాలో ఫహద్ హీరోగా నటిస్తే తనకు పిచ్చ హ్యాపీగా ఉంటుందని వ్యాఖ్యానించింది. సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమైంది. సౌత్ లాంగ్వేజెస్ తో పాటు, హిందీలో ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా గడిపేస్తోంది సమంత.