బాలయ్య డైరెక్షన్లో రావలసిన ఆ రెండు సినిమాలు ఏమిటో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతులో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు ఒకరు.. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ టాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బాలయ్య సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సీన్లకు, పవర్ ఫుల్ డైలాగ్లకు పెట్టింది పేరు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే బాలకృష్ణకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

Balakrishna on Chaitanya Ratham in NTR Biopic-Telugu Bullet

ఇక బాలకృష్ణ కేవలం హీరో గానే కాకుండా సింగర్ గా కూడా తన సినిమాల్లో పాటలు కూడా పాడాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన పైసా వసూల్ సినిమాలో బాలయ్య పాడిన పాట ఎంతో హిట్ అయింది. ఆ పాట ఎప్పటికీ అభిమానులు ఎంతో ఆదరిస్తున్నారు. అంతేకాకుండా బాలకృష్ణలో దర్శకుడు కూడా దాగి ఉన్నాడు. గతంలో ఆయన రెండు పౌరాణిక సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశం మధ్యలోనే చేజారి పోయింది.

బాలకృష్ణ మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా సామ్రాట్ అశోక. ఈ సినిమాను బాలయ్య దర్శకత్వంలో చేయాలని ఎన్టీఆర్ భావించారు. అందుకే ముందుగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను బాలయ్యకు అప్పచెప్పారు. అయితే ఈ సినిమాకు ముందుగా బుద్ధం అశోక అనే టైటిల్ పెట్టారు. ఇందులో గౌతమ బుద్ధుడు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారనీ వార్తలు వచ్చాయి. అయితే తర్వాత టైటిల్ సామ్రాట్ అశోకగా మారిపోయింది. రామకృష్ణ స్టూడియోలో సినిమా మొదలైంది.

Samrat Ashoka - Wikipedia

చాణిక్యుడి గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ పై బాలయ్య ఫస్ట్ క్లాప్ కోట్టారు. అయితే తర్వాత తన తండ్రి ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే విషయంలో వచ్చిన మనస్పర్ధలు కారణంగా బాలయ్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి బాలయ్య నర్తనశాల సినిమాను తన సొంత దర్శకత్వంలో తెరకెక్కించాలని అంతేకాకుండా ఆ సినిమాలో అర్జునుడుగా నటిస్తూ ఈ సినిమాని తీయాలని భావించాడు.

ఈ సినిమాలో ద్రౌపదిగా సౌందర్య మిగిలిన పాత్రలో శ్రీహరి, శరత్ బాబు వంటి నటులను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించాడు బాలయ్య. రెండో షెడ్యూల్ షూటింగ్ స్టార్‌ అయ్యే సమయంలో.. తన మరో సినిమా విజయేంద్ర వర్మ షూటింగ్లో బాలయ్య గాయపడ్డాడు. ఆ తర్వాత నర్తనశాల సినిమా షూటింగ్ కు గ్యాప్ రావడం. అదే సమయంలో విమాన ప్రమాదంలో సౌందర్య మరణించడంతో ఈ సినిమా అక్కడతో ఆగిపోయింది.