చిరు సీరియల్‌లో నటించారనే విషయం మీకు తెలుసా.. ఆ సీరియల్ ఏమిటంటే..!

స్టార్ హీరోలుగా ఉన్న ఎంతోమంది హీరోలు ముందుగా వారి కెరీర్‌ను బుల్లితెరపై మొదలుపెట్టిన వారే. అలానే ఆ తర్వాత సినిమాలో అవకాశాలు రావడంతో వెండితెరపై స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. తాజాగా కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న రాక్ స్టార్ యాష్ కూడా ముందుగా తన కెరీర్‌ను బుల్లితెర మీదే మొదలుపెట్టాడు. అంతే కాకుండా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూడా తన కెరీర్ ఆరంభంలో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగాడు.

Chiranjeevi: ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన చిరు.. ఆ ఒక్క కార‌ణంతో  వ‌దిలేశాడా? - PakkaFilmy

అయితే ఇప్పుడు ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరియర్ బిగినింగ్‌లో ఓ సీరియల్స్ లో నటించారట. చిరంజీవి సీరియల్‌లో నటించారని చాలామందికి తెలియదు. అంతేకాదు ఈ విషయం చెబితే చాలామంది నమ్మరు కూడా. కానీ చిరంజీవి సీరియల్ లో నటించారు అనేది మాత్రం అక్షరాలా నిజం. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో హీరోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. ఇక చిరంజీవి రెండు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.

Chiranejevi

చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో హిందీలో వ‌చ్చే డైలీ సీరియల్ ర‌జినిలో నటించారట. ఈ సీరియల్ లో ఓ గెస్ట్ పాత్రని పోషించారట చిరు. అయితే ఆ తర్వాత కూడా కొన్ని ఎపిసోడ్స్ లో చిరంజీవి పాత్ర ఉందట. కానీ అప్పటికే చిరంజీవి కి వ‌ర‌స‌ సినిమా అవకాశాలు రావడంతో ఆ సీరియల్ లో పూర్తిగా నటించలేకపోయారట. ఇలా చిరంజీవి మొదట్లో ఓ టీవీ సీరియల్ లో కూడా నటించారు అనేది ఎవరికీ తెలియని విషయం.