శోభన్ బాబు “సర్పయాగం” సినిమాకు..టిప్ టాప్ రామిరెడ్డికి సంబంధం ఏమిటి..?

కొన్ని సినిమాలు రియ‌ల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతాయి. అలా తెర‌కెక్కిన చాలా సినిమాలు ప్రేక్ష‌కుల మ‌నసుదోచేస్తాయి. అలాంటి రియ‌ల్ స్టోరీతోనే శోభ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన స‌ర్ప‌యాగం సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో శోభ‌న్ బాబుకు కూతురు పాత్ర‌లో రోజా న‌టించింది. ఈ సినిమా రోజాకు రెండో సినిమాగా తెర‌కెక్కింది. ఇక ఈ సినిమాను రిలయ్ స్టోరీ ఆధారంగా తెర‌కెక్కించార‌ని చాలా మందికి తెలియ‌దు.

Sarpayagam Telugu Movie Full HD Part 2/12 | Sobhan Babu | Roja Selvamani |  Suresh Productions - YouTube

ఈ సినిమా ఓ మనిషి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కించారని చాలామందికి తెలియదు. ఈ సినిమా కథ‌ నిజంగా ఒంగోలులో జరిగింది. ఆ టైంలో ఒంగోలులో గుండాయిజం, రౌడీయిజం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో జరిగిన కథ.. ముగ్గురు యువకులు ఓ కాలేజీ యువతపై మానభంగం చేశారు. ఆ యువతి తండ్రి పేరు కోదండరామిరెడ్డి ఈయనకు డ్రై క్లీనింగ్ దుకాణం ఉంది దీని పేరు టిప్ టాప్ కావడంతో ఆయన టిప్ టాప్ రామిరెడ్డిగా ఒంగోలులో ఫేమస్ అయ్యారు. రామిరెడ్డికి తన కూతురు చిన్నతనంలోనే భార్య మరణించింది. దీంతో కూతురును చాలా ప్రేమగా పెంచుకున్నాడు.

 Facts About Sobhan Babu Movie Sarpayagam Movie Ongole Tip Top Reddy Details-TeluguStop.com

డిగ్రీ త‌ర‌వాత కూతురు వివాహం జ‌రిపించాల‌ని అనుకున్నారు. కానీ ముగ్గురు మృగాళ్లు చేసిన ప‌ని వ‌ల్ల రామిరెడ్డి కూతురు లెట‌ర్ రాసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆ లెట‌ర్ లో….ఆ ముగ్గురినీ వ‌దిలి పెట్టొద్దు నాన్న అని రాసి ఎంతో ఆవేద‌న‌తో తండ్రికి చివ‌రి లేఖ రాసింది. ఇక‌ ఆ ముగ్గురు యువ‌కులు కూడా చిల్ల‌రగా తిరిగేవారే. వారిలో డ‌బ్బు అధికారం క‌లిగిన కుటుంబాల నుండి కూడా ఉన్నారు. ముగ్గురిలో ఒక‌డు హాకీ కోచ్, మ‌రొక‌డు ఆర్టీసీ డిపో మేనేజ‌ర్ కొడుకు వాడికి డ‌బ్బు పొగ‌రు రాజ‌కీయ అండ‌దండ‌లు ఉన్నాయి.

Sarpayagam Telugu Full Movie HD | Telugu Movies HD | Sobhan Babu | Roja |  Suresh Productions - YouTube

మూడో వాడు ఒక తాగుబోతుని కూతురు రాసిన ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరం చదివిన టిప్ టాప్ రామి రెడ్డి కోపంతో రగిలిపోయాడు. ఎలా అయినా ఆ ముగ్గురిని చంపి తన కూతురుకు ఆత్మశాంతి కలిగించాలని… ఇద్దరు కిరాయి మనుషులతో కలిసి తన కూతుర్ను పాడుచేసిన ఇద్దరి మానవ మృగాలను చంపేశాడు. తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. ఈ విషయం ఒంగోలులో ఆ నోట ఈ నోట పడి టిప్ టాప్ రామిడ్డి హీరో అయిపోయాడు. అలా ఈ విషయం ఓ రోజు పేపర్లో వచ్చింది ఈ వార్తను చూసిన పరుచూరి బ్రదర్స్.. దీన్నే సినిమా కథగా మార్చి సర్పయాగం అనే సినిమా తీశారు. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ ను షేక్‌ చేసింది.