లోకేష్@ 1000..సక్సెస్ అయినట్లేనా.!

యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది..ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. అయితే ప్రారంభమైనప్పుడు పరిస్తితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్తితి ఏంటి? అనేది చూసుకుంటే. కుప్పంలో మొదలైంది కాబట్టి..మొదట భారీగానే టి‌డి‌పి శ్రేణులు తరలివచ్చాయి.

ఆ తర్వాత నుంచి జిల్లాలో పాదయాత్ర కొనసాగింది..కానీ అనుకున్న మేర ప్రజా మద్ధతు రాలేదు. అయితే నిదానంగా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న తీరు..ఆయన మాట్లాడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. అలాగే అన్నీ వర్గాల ప్రజా సమస్యలని తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళ్లారు.  పలమనేరు, నగరి, పలమనేరు నియోజకవర్గాల్లో అనూహ్యంగా ప్రజా స్పందన వచ్చింది. చిత్తూరులోని 14 స్థానాల్లో లోకేష్ పాదయాత్ర సాగింది. ఆ జిల్లాలో మెజారిటీ స్థానాల్లో పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇక లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో పాదయాత్ర జరిగింది. అక్కడ దాదాపు 9 స్థానాల్లో పాదయాత్ర కొనసాగింది.

అక్కడ కూడా ఊహించని విధంగా ప్రజా మద్ధతు వచ్చింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో కూడా అంతకంటే ఎక్కువగానే ప్రజల నుంచి మద్ధతు లభిస్తుంది. ఇక లోకేష్ పాదయాత్ర చేస్తూ..స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కర్నూలులో ఎమ్మెల్యే శ్రీదేవి, మంత్రి జయరాం టార్గెట్ గా లోకేష్ విరుచుకుపడిన విషయం తెలిసిందే.

ఈ అంశాలు ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి. దీంతో టి‌డి‌పికి మరింత బలం వస్తుంది. ఇక 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర అని మొదలుపెట్టిన లోకేష్..ఇప్పటికీ 1000 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయన నాయకుడుగా పరిణితి చెందడం..ఇటు పార్టీకి కొత్త ఊపు తీసుకురావడం చేశారు.