ఈ ముగ్గురు హీరోల్లో ఉన్న ఇంట్ర‌స్టింగ్‌ కామన్ పాయింట్ ఏంటో తెలుసా..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వకపోయినా కెరీర్ రోజుల్లో మాత్రం కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశాలను ఇచ్చారు. రాజమౌళి, వినాయక్ ఎన్టీఆర్ సినిమాలతోనే ఇండస్ట్రీకి పరిచయమైన విష‌యం తెలిసిందే. తారక్- రాజమౌళి కాంబోలో వ‌చ్చిన‌ స్టూడెంట్ నంబర్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది.

కళ్యాణ్ రామ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఎందుకు కొట్టలేకపోతున్నరంటే.. | why  hero nandamuri kalyan ram not getting back to back hits details, Kalyan  ram, nandamuri kalyan ram, nandamuri kalyan ram ...
తారక్ – వినాయక్ కాంబినేషన్ లో ఆది సినిమా తెరకెక్కగా ఈ సినిమా కూడా కమర్షియల్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తారక్ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన దర్శకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా త‌మ‌ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలతో సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, మల్లిడి వశిష్ట వంటి వారు దర్శకులుగా కెరీర్ మొదలుపెట్టారు. కళ్యాణ్ రామ్ సురేందర్ రెడ్డి కాంబోలో అతనొక్కడే సినిమా తెరకెక్కింది.

కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి కాంబోలో పటాస్ సినిమా తెరకెక్కగా కళ్యాణ్ రామ్ – మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో బింబిసార తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ సినిమాలతో పరిచయమైన డైరెక్టర్లు కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. మ‌రో యంగ్ హీరో నిఖిల్- సుధీర్ వర్మ కాంబోలో స్వామిరారా, నిఖిల్- చందు మొండేటి కాంబోలో కార్తికేయ వంటి సినిమా వ‌చ్చాయి. నిఖిల్ సినిమాలతోనే ఈ ఇద్దరు డైరెక్టర్లు దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి సక్సెస్ సాధించారు.

Sharwanand injured his shoulder

ఈ దర్శకులకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. శర్వానంద్ – సుజీత్ కాంబోలో రన్ రాజా రన్ తెరకెక్కగా ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమైన సుజీత్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నిఖిల్, శర్వానంద్ సినిమాలతో పరిచయమైన దర్శకులలో ఎక్కువ శాతం దర్శకులు సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ఈ ముగ్గురు హీరోలతో పరిచయమైతే తమ కెరియర్ బాగుంటుందని కొత్త దర్శకులు భావిస్తున్నారు.