4 రోజుల్లో బ్రేక్ ఈవెన్‌.. `ద‌స‌రా` టోట‌ల్ క‌లెక్ష‌న్స్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన `ద‌స‌రా` బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో.. ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

తొలి రోజే ఇర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింద‌ని సినీ పండితులు చెబుతున్నాడు. నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 6.72 కోట్ల షేర్ ని దక్కించుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ. 8.87 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఇక ద‌స‌రా నాలుగు రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు.

నైజాం: 18.32 కోట్లు
సీడెడ్: 4.65 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 3.44 కోట్లు
తూర్పు: 1.78 కోట్లు
పశ్చిమ: 1.05 కోట్లు
గుంటూరు: 2.05 కోట్లు
కృష్ణ: 1.50 కోట్లు
నెల్లూరు: 0.74 కోట్లు
——————————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 33.53 కోట్లు(56.50 కోట్లు~ గ్రాస్‌)
——————————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 3.75 కోట్లు
ఇతర భాషలు – 1.20 కోట్లు
నార్త్ ఇండియా – 1.30 కోట్లు
ఓవ‌ర్స్‌ – 7.35 కోట్లు
————————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 47.13 కోట్లు(84.00 కోట్లు~ గ్రాస్)
————————————————

ఏదేమైనా టైర్ 2 హీరో సినిమా నాలుగు రోజుల్లోనే ఈ రేంజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు. నాని కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టిన చిత్రంగా ద‌స‌రా రికార్డు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.