సమంతకు ర‌ష్మిక బిగ్ షాక్‌.. భారీ ప్రాజెక్ట్ ను ఎగ‌రేసుకుపోయిన నేష‌న‌ల్ క్ర‌ష్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా తాజాగా స‌మంత‌కు బిగ్ షాక్ ఇచ్చింది. స‌మంత చేయాల్సిన ఓ భారీ ప్రాజెక్ట్ ను తాను ఎగ‌రేసుకుపోయింది. కెరీర్‌లో తొలిసారి ర‌ష్మిక‌ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. అదే `రెయిన్‌బో`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతోన్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ఇందులో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఎస్ఆర్ ప్ర‌భు, ఎస్ఆర్ ప్ర‌కాష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన డైరెక్ట‌ర్ శాంతరూబన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. కేఎం జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించనున్నారు.

ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఏప్రిల్ 7 నుంచి స్టార్ట్ కానుంది. అన్ని వయసుల ప్రేక్షకులను అల‌రించే విధంగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. అయితే నిజానికి గ‌తంలో ఈ ప్రాజెక్ట్ కోసం సమంతను ఎంపిక చేశారు. కార‌ణం తెలియ‌దు గానీ ఇప్పుడు స‌డెన్ గా ఆమెను తొలగించి.. ర‌ష్మిక‌ను తీసుకున్నారు. మ‌రి ప్రాజెక్ట్ డిలే అవుతుంద‌ని స‌మంత‌ను తీసేశారా..? లేక స‌మంత‌నే ఈ మూవీ నుంచి త‌ప్పుకుందా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

https://twitter.com/DreamWarriorpic/status/1642738759543447554?s=20