వై నాట్ పులివెందుల..కుప్పంలో లక్ష మెజారిటీ..సాధ్యమేనా?

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో వై నాట్ గోల ఎక్కువైంది. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అసలు ప్రజలకు అంతా మంచే చేస్తున్నామని అలాంటప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని..వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. అంటే కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుస్తామని అంటున్నారు.

అయితే జగన్ కు కౌంటరుగా చంద్రబాబు కూడా అదే వై నాట్ కాన్సెప్ట్ అందుకున్నారు. కాకపోతే ఆయన వేరే స్టైల్ లో మొదలుపెట్టారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని..అసలు వై నాట్ పులివెందుల అని బాబు అంటున్నారు. అంటే పులివెందులలో కూడా జగన్ ని ఓడిస్తామని అంటున్నారు. ఈ మధ్య వై నాట్ పులివెందుల అనే స్లోగన్ ఎక్కువగా పలుకుతున్నారు. అదే సమయంలో కుప్పంలో గెలుస్తామని వైసీపీ హడావిడి చేస్తుందని, ఈ సారి అక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నానని బాబు..తాజాగా జోనల్ సదస్సులో భాగంగా నెల్లూరులో జరిగిన సమావేశంలో అన్నారు.

అయితే బాబు చెప్పినవి సాధ్యమవుతాయా? అంటే కష్టమనే చెప్పాలి…అందులో మొదట పులివెందులలో జగన్ ని ఓడించడం అసాధ్యమైన పని…కాకపోతే వైసీపీని టెన్షన్ పెట్టడానికి అదొక మైండ్ గేమ్ అని చెప్పవచ్చు. అలాగే కుప్పంలో బాబుకు లక్ష మెజారిటీ కూడా డౌటే. గెలవడం ఈజీ ఏమో గాని..లక్ష మెజారిటీ అంటే కష్టమనే చెప్పాలి.

కాబట్టి బాబు చెప్పేవి పెద్దగా వర్కౌట్ కావనే చెప్పాలి. అదే సమయంలో జగన్ అంటున్నట్లుగా వై నాట్ 175 అనేది కూడా అసాధ్యమనే చెప్పాలి. అది కూడా ఒక మైండ్ గేమ్.