ప్రియాంక చోప్రా ఆ హీరోని ఇంకా మర్చిపోలేదా..?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో స్టార్ డం సంపాదించుకున్న వారిలో గ్లోబుల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఒకరు. ప్రస్తుతం సీటాడెల్ ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ అమ్మడు షేర్ చేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల పైన తనదైన స్టైల్ లో స్పందించిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత ఈమె మాట్లాడిన మాటలతో రెండు మూడు రోజులు చర్చలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఒక జాకెట్ సీక్రెట్ ని రివీల్ చేసింది.

Priyanka Chopra As Soon As Introduced Ex-Boyfriend's Jacket To A Discuss  Present And Created Controversy - Wsquarenews
ప్రమోషన్ లో భాగంగా ఒక కార్యక్రమంలో హాజరైన ప్రియాంక చోప్రా లెదర్ జాకెట్లో ప్రత్యక్షమైంది.. ఈ జాకెట్ బాగుంది అంటూ యాంకర్ సరదాగా ముచ్చటించింది. దీంతో ఈమె తన పాత జ్ఞాపకాలను సైతం తెలియజేస్తోంది .ఈ జాకెట్ చాలా స్పెషల్ అని నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఇచ్చాడని అతను నా నుంచీ వెళ్లిపోయిన ఈ జాకెట్ మాత్రం నా దగ్గరే ఉందంటూ తెలియజేసింది. ఇప్పటికి తాను టచ్లో ఉంటే బాగుండు అని అర్థం వచ్చేలా స్పందించినట్లు తెలుస్తోంది.. దీంతో బాలీవుడ్ మీడియా ఆ జాకెట్ స్టోరీ ఏంటో అంటూ తెలుసుకొని ప్రయత్నం చేశారు..

When Shah Rukh Khan & Priyanka Chopra's Midnight Nikah Rumours Brought  Sleepless Nights To Many, Actor Rubbishing Had Said: "It's Disrespectful..."
దీంతో భాగంగా గతంలో షారుక్ ధరించిన నల్లటి జాకెట్ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. దీంతో పాత కహానీలు మళ్ళీ వెలుగులోకి వస్తున్న షారుక్, ప్రియాంక చోప్రా మధ్య అప్పట్లో రిలేషన్షిప్ నడిచినట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. షారుక్ కారణంగానే అతని వైఫ్ గౌరీఖాన్ ప్రియాంక చోప్రాను అవకాశాలు లేకుండా చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. అయితే అప్పటికే ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్గా ఎదగడంతో గౌరీకాన్ రాజకీయాలు పెద్దగా వర్కౌట్ కాలేదని వార్తలు వినిపించాయి. తాజాగా ప్రియాంక చోప్రా ధరించిన జాకెట్టు కారణంగా ఈ విషయాలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.