మరొకసారీ ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ అదితి..!!

నటుడు సిద్ధార్థ్ .. హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయం మీద మాత్రం ఎవరు స్పందించలేదు. వీరిద్దరూ కలిసి పలు వేడుకలకు కూడా హాజరు అవ్వడం తో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రోజురోజుకు ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

Aditi Rao Hydari shares a pic with rumoured beau Siddharth and her peeps; He says 'no one like you' | PINKVILLA

తాజాగా అదితి రావ్ హైదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో మరొకసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రియమైన వారితో అంటూ తన దిగిన ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.ఇందులో..సిద్ధార్థ్ .. అదితి రావ్ హైదరి ఉండడం కూడా కనిపిస్తోంది .. అదితి రావ్ హైదరి హీరోయిన్గా చేస్తున్న సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ప్రేమ వార్తల్లోనే తరచూ నిలుస్తోంది. ఇటీవల టాలీవుడ్కు చెందిన ఒక స్టార్ హీరో పెళ్లి వేడుకలలో కూడా వీరిద్దరూ సందడి చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా మీడియా దృష్టిలో బాగా వైరల్ గా మారారు.

మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలయ్యిందని వార్తలు వినిపించాయి. అయితే మొత్తానికి వీరిద్దరి మధ్య వస్తున్న ప్రేమ వార్తలు నిజమేనంటూ ప్రచారం జరుగుతోంది మరి త్వరలోనే వీరిద్దరూ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ అభిమానులు సైతం భావిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరూ సక్సెస్ అయిన దాకాలే లేవు.. మరి ఏ మేరకు తన తదుపరి చిత్రాలను ప్రకటిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)