ప్రభాస్ ఆ సూపర్ హిట్ సినిమా నుంచి రకుల్‌ను ఎందుకు తీసేసారు.. రెబల్ స్టార్ కు నచ్చలేదా..!

సాధారణంగా ఒక సినిమాలో ఒక హీరోను లేదా హీరోయిన్‌ను ముందుగా అనుకొని వాళ్ళతో కొద్దిరోజులు షూటింగ్ చేశాక.. వాళ్ళను మార్చి ఆ ప్లేస్‌లోకి కొత్త హీరో, హీరోయిన్లను తీసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఆ హీరో, హీరోయిన్లతో దర్శకులకు లేదా నిర్మాతలకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన లేదా హీరో హీరోయిన్ల జంట సరిగా మ్యాచ్ కాలేదని దర్శ‌కులు లేదా నిర్మాతలు భావిస్తే వాళ్ళను మార్చేస్తూ ఉంటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ సినిమా హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగింది అట.

Mr Perfect 2011 watch online OTT Streaming of movie on Amazon Prime  Video,Voot,MX Player,Mubi

ఈ సినిమా కోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రభాస్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య 4 – 5 రోజులు పాటు షూటింగ్ కూడా చేశారు. అయితే ఆ ఫుటేజ్ చూశాక హీరో ప్రభాస్ తో పాటు నిర్మాతకు ఏదో అసంతృప్తిగా ఉందట. హైట్‌గా ఉన్న ప్రభాస్ పక్కన బక్క పల్చగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఏ మాత్రం సరైన జోడిగా సూట్ కావటం లేదని భావించారట. అప్పటికే కొన్ని సీన్లు షూట్ చేయడంతో రకుల్ ప్రీత్ సింగ్‌ను కొనసాగించాలా వద్దా ? అన్న డైల‌మాలో దర్శక,నిర్మాత‌లు ఉన్నారట.

అయితే ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ మేక‌ర్లు, హీరో ప్రభాస్‌తో చర్చించుకుని ఆమెకు బదులుగా కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. చివరకు వాళ్ళు ఇదే విషయాన్నిరకుల్ ప్రీత్‌తో చెప్పేశారట. రకుల్ ప్రీత్ కూడా కన్విన్స్ అయ్యి సినిమా నుంచి తప్పుకునేందుకు ఓకే చెప్పిందట. అప్పుడు ప్రభాస్‌కి జోడిగా ఎవరిని తీసుకోవాలని అనుకున్నప్పుడు పలువురు హీరోయిన్ల పేర్లు చర్చ‌కి వచ్చాయి. కాజల్ అయితే ప్రభాస్‌కి జోడీగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని అందరూ భావించారు. కాజ‌ల్ అప్ప‌టికే ప్ర‌భ‌స్‌తో డార్లింగ్ సినిమాలో చేసింది. ఆ మూవీ కూడా సూప‌ర్ హిట్ అయింది. అలా ప్ర‌భ‌స్ ప‌క్క‌న మ‌రోసారి కాజ‌ల్ న‌టించ‌డానికి రేడి అయింది.

Watch No. 1 Mr Perfect Movie Online for Free Anytime | No. 1 Mr Perfect  2011 - MX Player

వెంటనే కాజ‌ల్‌ను అడగడంతో చాలా హ్యాపీగా ప్ర‌భాస్ ప‌క్క‌న చేసేందుకు ఓకే చెప్పేసిందట. అలా ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ సినిమాలోకి కాజల్ వచ్చి చేరింది. విచిత్రం ఏంటంటే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా నటించినా ప్రభాస్ పక్కన మాత్రం ఆమె మళ్లీ నటించలేకపోయింది. ఇక రాబోయే రోజుల్లో అయినా ప్రభాస్ రకుల్ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.