టాలీవుడ్‌లో కోన్ని కాంబినేషన్‌లు మాత్రం చిత్ర-విచిత్రంగా ఉంటాయి. స్టార్ హీరోయిన్‌లు- స్టార్ హీరోల కాంబినేషన్లలో సినిమాలు వస్తే చూసేందు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. అయితే నయనతార- మాహేష్‌బాబు, నయనతార – పవన్‌కళ్యాన్ కాంబినేషన్లలో ఒక్క సినిమా కూడా రాలేదు. సహజంగా ఏ స్టార్ హీరోయిన్ వచ్చినా ప్రస్తుతం ట్రెడింగ్ లో ఉన్న టాప్ హీరోలు, యంగ్ హీరోలు అందరితోను సినిమాలు చేస్తూ ఉండటం మామూలే.
అయితే ఎందుకోగాని నయానతార గత 15 సంవత్సరాలుగా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నా తెలుగులో పవన్ కళ్యాన్. మహేష్‌బాబుతో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. వాస్తవంగా చూస్తే పవన్‌కళ్యాన్ – అనుష్క కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే చివరిలో దర్శకుడు హీరోయిన్ పేరు మర్చేయడంతో మనం వెండి తెరపై పవన్- అనుష్క కాంబినేషన్‌ను చూడలేక పోయాం. పవన్‌కళ్యాన్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం సినిమా వచ్చింది.
దేవయాని హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. పవన్ మరోసారి భీమినేని శ్రీనివాసరావుకు అన్నవరం సినిమాతో రెండో ఛాన్స్ ఇచ్చాడు. 2006 డిసెంబర్ లో ఎన్టీఆర్ రాఖీ సినిమాకు పోటిగా అన్నవరం రీలీజ్ అయింది. చెల్లి సెంటిమెంటుతో ఈ సినిమా తెరకెక్కంది. పవన్ కూ జోడిగా ఆశిన్ హీరోయిన్‌గా నటించగా… సంధ్య హీరో చెల్లిగా నటించింది. సంధ్యకు జోడిగా… పవన్ కు బావమరిదిగా శివబాలాజీ నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకోవాలని ముందుగా చర్చలు జరిగాయి.
అంతకు ముందు ఏడాది అనుష్క చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ఐటమ్ సాంగ్ చెసింది. అదే టైంలో మరో హీరోయిన్ త్రిష కూడా పవన్ బంగారం, చిరు స్టాలిన్ సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే అనుష్కను కూడ పవన్‌కు జోడిగా ముందు అన్నుకున్నా, తరువాత భీమినేని ఆమె స్థానంలో ఆశిన్‌ను తీసుకున్నారు. అలా పవన్ – అనుష్క కాంబినేషన్ ఆగిపోయింది. ఆ తరువాత నయనతార – పవన్ కాంబినేషన్ కూడా సెట్ కాలేదు.