టాలీవుడ్‌కు వెంకీ- నాగ్ దండగ‌మారి హీరోలా… ఇంత‌క‌న్నా ఫ్రూప్ కావాలా…!

గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు హీరోలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు ముఖ్యమైన స్తంభాలుగా నిలుస్తూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉండేవాడు. ఆ తర్వాత రెండో స్థానంలో ఎప్పుడు బాలకృష్ణ- చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చేవాడు.

Senior Heroes Following A Set Pattern These Days! | Tupaki English

తర్వాత మూడో స్థానంలో వెంకటేష్- నాగార్జున త‌మ‌ సినిమాలతో కొనసాగే వారు. ఇప్పటికీ కూడా ఈ హీరోలు అలానే తమ సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఏ సినిమా చేసినా కూడా అది ఈజీగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతున్నాయి. తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమాలు కూడా ఇప్పటికీ అదే జోష్‌లో చిరంజీవికి పోటీ ఇచ్చే విధంగా భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి.

అయితే ఈ రేసులో మాత్రం వెంకటేష్- నాగార్జున మాత్రం కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. గతంలో ఈ నలుగురు సీనియర్ హీరోల రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎంతో వ్యత్యాసం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం కోట్ల రూపాయల్లో వ్యత్యాసం ఉందని తెలుస్తుంది. చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని తన రెమ్యూనరేషన్‌ను 70 నుంచి 80 కోట్ల వరకు పెంచినట్టు తెలుస్తుంది.

ఇక బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస విజయాలతో సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా అదరగొడుతున్నాడు బాలయ్య. దీంతో తన రెమ్యూనరేషన్‌ను 20 కోట్ల వరకు పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఇంత బారి స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటే వెంకటేష్- నాగార్జున మాత్రం వారి సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూ.. బయట వారితో సినిమాలు చేసినప్పుడు మాత్రం కాస్త తక్కువగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

హిట్ కాంబినేషన్స్ తో నాగ్, వెంకీ సీక్వెల్స్.. హిట్టు కొడతారా | Venkatesh, Nagarjuna Sequels With Hit Combinations , Venkatesh, Nagarjuna, Amala, Meena, Bangarraju, Soggade Chinni Nayana, Drushyam -2 ...

ఆ సినిమాల లాభాల్లో వాటా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా కానీ వారి సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు.మొత్తానికి ఈ నలుగురు హీరోల్లో ఇప్పటికీ బాలకృష్ణ- చిరంజీవి మాత్రం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో అయినా నాగ్‌- వెంకీ విజయాల బాట పడుతారో లేదో చూడాలి.