చిత్ర పరిశ్రమలో రీమిక్ చేయని హీరో ఎవరు ఉంటే చెప్పడం చాలా కష్టం. జెన్యూన్ గా చెప్పాలంటే ఒక మహేష్ మాత్రమే వీటి జోలికి వెళ్లని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మన సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారు కూడా ఎన్నో రీమేక్లు చేసిన వాళ్లే. ప్రస్తుతం ఇప్పుడు సినిమాల ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తుంది. హీరోలు వారు చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిని తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు.
ఇప్పటికీ టాలీవుడ్ లో ఎన్నో రీమిక్ సినిమాలు వచ్చిన ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి. తాజాగా వచ్చిన బుట్ట బొమ్మ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇలాంటి సమయంలో దర్శక నిర్మాతలు కూడా రీమేక్ సినిమాల వెంట పడటం తగ్గిస్తున్నారు. ఎంతో ప్రాక్టికల్ గా ఆలోచించి మరి కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందని నమ్మకం వస్తేనే రీమేక్ సినిమా హక్కులను కొనటం వాటిని స్టేట్స్ పైకి తీసుకువెళ్తం చేస్తున్నారు. అంతే తప్ప వాటి విషయంలో తొందర మాత్రం పడటం లేదు.
టాలీవుడ్ లో మాత్రం ఇద్దరు స్టార్ హీరోలు ఇంకా రీమిక్ సినిమాలు వెంట పడుతూ వారి అభిమానులను తీవ్ర నిరాశ పరుస్తున్నారు. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటికీ వీరు నటించే సినిమాల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు ఉండటం గమనార్హం. చిరంజీవి గత సంవత్సరం మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేయగా ఇక్కడ ఈ సినిమా విడుదలయై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షలను రాబట్టలేకపోయింది.
అయినా కూడా చిరంజీవి ప్రస్తుతం కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానులు ఎంత వద్దని చెబుతున్నా హరీష్ శంకర్ తో తేరి రీమేక్‌కే ఓటేశాడు. వీటితో పాటు మరో కోలీవుడ్ సినిమా వినోదయ సితం రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇలా ఈ అన్నదమ్ములు ఇద్దరు మాత్రం అందరూ మారిన వారు మాత్రం రీమిక్ సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సినిమాలు వీళ్ల దగ్గర నుంచి వస్తాయో చూడాలి.