సంపాదనలో భ‌ర్త‌ల‌ను మించిపోయిన స్టార్ హీరోల భార్య‌లు వీళ్లే…!

మన టాలీవుడ్ లో ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు ఎవరు ఊహించిన రీతిలో కోట్ల రూపాయల్లో రెమ్యూనరేషన్ అందుకుంటారు. ఈ విషయంలో మాత్రం ఇతర ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పోలిస్తే మన హీరోలు ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉన్నారు. అయితే ఈ హీరోల కంటే వారి భార్యలు మాత్రం వారి కంటే ఎక్కువ సంపాదిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏ హీరోల భార్యలు ఎంతెంత సంపాదిస్తున్నారు ఇప్పుడు చూద్దాం.

ముందుగా న్యాచురల్ స్టార్ నాని భార్య- అంజన కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ ప్రతి నెల తన భర్త కంటే అధిక సంపాదను ఇంటికి తెస్తుంది. మెగా కోడలు రామ్ చరణ్ భార్య- ఉపాసన ఇండియాలోనే టాప్ మోస్ట్ హాస్పిటల్స్ లో ఒకటైన అపోలో హాస్పటల్స్ కి చైర్మన్ గా ఉంటూ మెగా కుటుంబంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న కోడలుగా పేరు తెచ్చుకుంది.

7 South Indian Actors Who Tied The Knot With Daughters Of Rich Businessmen:  Allu Arjun To Ram Charan

మరో హీరో అల్లరి నరేష్ భార్య కూడా ఈవెంట్ మేజర్ గా పని చేస్తూ తన భర్త సంపాదించే సంపాదన కన్నా రెండు రేట్లు అధికంగా సంపాదిస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య- స్నేహ రెడ్డి ఎంతో టాలెంటెడ్ అండ్ స్టైలిష్ వుమెన్. ఈమె కూడా మ్యాగజైన్లకు ఎడిటర్ గా పనిచేస్తూ.. తన తండ్రి వ్యాపారాలలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ విధంగా తన భర్త అల్లు అర్జున్ కంటే అధికంగానే సంపాదిస్తుంది.

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల భార్య- సుమా కూడా యాంకర్ గా పని చేస్తూ పలు టీవీ షోలకు ఈవెంట్లకు వ్యాఖ్యాతగా చేస్తూ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్‌ దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్నమాయి కూడా త‌న‌ భర్త కంటే అధికంగానే సంపాదిస్తుంది. ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, అటు సింగర్ గా రెండు చేతుల్లో భర్త కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటుంది.

సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ భార్య- జీవిత కూడా ఇటు సినిమాలలో నటిస్తూ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఆదాయాన్నిపెంచుకుంటుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ భార్య- నమ్రత కూడా తన తండ్రి ద్వారా వచ్చిన బిజినెస్ లు చూస్తూ ఎవరు ఊహించని రీతిలో సంపాదిస్తున్నారని తెలుస్తుంది. ఈ విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలతో పోలిస్తే వారి భార్యలే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు.. ఇక ఈ విషయం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక వేరే కాకుండా చాలామంది హీరోల భార్యలు కూడా వారి భ‌ర్త‌ల‌ కంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నారు.