రేప్ సీన్లపై సంచలన కామెంట్స్ చేసిన బాలయ్య హీరోయిన్!!

 

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, బంగారు బుల్లోడు హీరోయిన్ రవీనా టాండన్ బాలీవుడ్‌లో తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. ఆమె తాను స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ధరించడానికి లేదా ముద్దు సన్నివేశాలు చేయడానికి నిరాకరించినందున తనపై ఇండస్ట్రీ అహంకారి అనే ముద్ర వేసినట్లు చెబుతూ వాపోయింది. అలానే తన బట్టలు పూర్తిగా చెడిపోకుండా ఉంటేనే తన సినిమాల్లో రేప్ సన్నివేశాలు చేయడానికి అంగీకరిస్తానని కూడా చెప్పింది. సాధారణంగా సినిమాల్లో రేప్‌ సన్నివేశాల్లో నటి వస్త్రాలన్నీ చెదిరిపోతాయి. ఒక్కోసారి ఆమె బట్టలన్నీ చెరిగిపోతాయి. ఈ సన్నివేశాల్లో ఆ నటిని ఒక వివస్త్రను చేసినట్లు కూడా చూపిస్తారు. అయితే ఇలాంటి రేప్ సన్నివేశాలలో తాను ఎప్పటికీ నటించనని రవినా ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

బాడీ షేమింగ్, ఇతర మహిళల విమర్శలతో సహా పరిశ్రమలో మహిళల పట్ల కఠినంగా ప్రవర్తించడం పట్ల రవీనా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి విరామం ఇవ్వాలనే నిర్ణయం గురించి కూడా చెప్పుకొచ్చింది. తనకు వ్యక్తిగత నిబంధనలు ఉన్నాయని, తనకు సౌకర్యంగా ఉండే పనులు మాత్రమే తాను చేస్తానని పేర్కొంది. డ్యాన్స్ స్టెప్పులు, స్విమ్మింగ్ దుస్తులను ధరించడం వంటి కొన్ని సన్నివేశాలలో తనకు నటించడం అసలు ఇష్టం ఉండదని కూడా చెప్పుకొచ్చింది.

ఇకపోతే 1991లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రవీనా 90వ దశకంలో ప్రముఖ నటిగా ఎదిగింది. ఆమె ఇప్పుడు సంజయ్ దత్‌తో అప్‌కమింగ్ “ఘుడచాడి”లో కనిపించనుంది. మరో రెండు ప్రాజెక్ట్‌లలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. రీసెంట్‌గా కేజిఎఫ్ 2 లో రవీనా కనిపించింది. గతంలో బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు సినిమాలో నటించిన ఈమె తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది.