కే. విశ్వనాథ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇదే..ఆయనకు ఎంత స్పెషల్ అంటే..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ సెలబ్రెటీ మరణించారు అన్న మరణ వార్త తాలూకా విషాద ఛాయలు మరవకముందే మరో స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం చిత్ర పరిశ్రమకే కాదు సినిమా జనాలకు , సినీ లవర్స్ కు తీరని శోకాన్ని మిగులుస్తుంది . ఇదే క్రమంలో రీసెంట్ గానే మరణించిన టాలీవుడ్ రెబల్ సీనియర్ హీరో కృష్ణంరాజు , సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదఛాయలు మరవకముందే మరో టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ మరణించారు .

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్న లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి ..కే విశ్వనాథ్ కొన్ని గంటల క్రితమే తుది శ్వాస విడిచారు . గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన గత వారం రోజులుగా మరింత గా ఆయన ఆరోగ్యం క్షిణీంచడంతో.. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సరే బాడీ చికిత్సకు రెస్పాండ్ కాకపోవడంతో ఆయన గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు . కాగా కళాతపస్వి మరణ వార్తతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది .

లెజెండ్ డైరెక్టర్ మన మధ్య లేడు అంటూ పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా ఇదే క్రమంలో కళాతపస్వికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . వాహినీ స్టూడియోలో సౌండ్‌ రికార్డింగ్‌ విభాగంలో కెరీర్‌ ప్రారంభించారు కె. విశ్వనాథ్‌. బి.ఎన్‌. రెడ్డి, కె.వి. రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళ పనితీరును సన్నిహితం గా పరిశీలిస్తూ వచ్చాడు . అంతేకాదు ఆయనలోని ప్రతిభను గుర్తించిన ఆదుర్తి దగ్గరుండి ఆయనను అన్నపూర్ణ పిక్చర్స్ కి తీసుకెళ్ళాడు. ఇదే క్రమంలో ఆదుర్తి ఆయన సినీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పాడు .

కాగా కె విశ్వనాథ్ డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా ఆత్మగౌరవం . అక్కినేని నాగేశ్వరరావు , ఆదుర్తి ప్రోత్సాహంతోనే ఆయన డైరెక్టర్ గా మారాడు . ఆయన ఎన్ని సినిమాలు తీసిన కానీ
కే. విశ్వనాథ్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శంకరాభరణం . అంతకుముందు సినిమాలు తీసిన శంకరాభరణం సినిమాతో తన పేరుని మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. అప్పటివరకు ఓ విధంగా వెళ్తున్న సినిమా ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో డైరెక్షన్ పరంగా మారుస్తూ సినిమా అంటే ఇది అంటూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. పాత పడిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను మరియు ముఖ్యంగా మ్యూజిక్ కి పెద్దపీట వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది .

శంకరాభరణం సినిమాకి ఆయన చూపించిన తీరు వర్ణతీతం . శంకరాభరణం సినిమా ఆయన కెరియర్ లో ఎప్పుడు క్లాసిక్ హిట్ గానే మిగిలిపోతుంది. ఆ తర్వాత ఎన్ని సినిమా లు తీసిన ఇప్పటికీ కళాతపస్వి అంటే అందరికీ శంకరాభరణం సినిమానే గుర్తొస్తుంది . ఆశ్చర్యం ఏంటంటే శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన రోజే కళాతప్ప తుది శ్వాస ని విడిచారు సరిగ్గా 42 ఏళ్ల క్రితం 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది . 2023 ఫిబ్రవరి 2న కళాతపస్వి తుది శ్వాస విడిచారు..!!