సిల్క్ స్మిత ను ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన టాప్ హీరో ఎవరంటే..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటి సిల్క్ స్మిత గురించి ఆమె అందం గురించి, నటన గురించి, డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. 1980 సంవత్సరంలో ఈమె హవా బాగా కొనసాగిందని చెప్పవచ్చు. ఒకానొక దశలో ఇమే డేట్ ల కోసం స్టార్ హీరోల సినిమా షూటింగులు కూడా పోస్ట్ ఫోన్ చేసుకునే వారట. అయితే సిల్క్ స్మిత తన కెరీర్లు 36 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఈ విషయం పెను సంచలనానికి దారి తీసింది. ముఖ్యంగా ఈమె మరణ వార్తపై ప్రేమ విఫలం అంటూ వార్తలు వినిపించాయి. మరి కొంతమంది మద్యానికి బానిసై మరణించింది అనే వార్తలు కూడా వైరల్ గా మారాయి.

Birth Anniversary | Maid became an actress, worked in 450 films and ended  her life by hanging! Read about Silk Smita … | Maid became an actress,  worked in 450 films and

కానీ సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.. ఈమె మరణించడానికి ముందు రోజు సాయంత్రం కొంతమంది నటీనటులకు ఫోన్ చేసిందని కొంతమంది ఇంటర్వ్యూలలో తెలియజేశారు. కానీ కొన్ని కారణాల చేత వెళ్లలేకపోయామంటూ కూడా తెలియజేసిన సందర్భాలు చాలామంది ఉన్నారు. సిల్క్ స్మిత మరణించిన వార్త విని సినీ పరిశ్రమ చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది కానీ ఈమె చివరి చూపు చూసేందుకు ఎక్కువ మంది రాకపోవడంతో అక్కడే ఉన్న జర్నలిస్టులకు ఇదొక షాకింగ్ విషయమని తెలియజేశారట.

Birthday boy Arjun Sarja's fan? How many of these facts did you know about  him? - Zee5 News
కానీ సిల్క్ స్మిత చివరిసారి చూసేందుకు వచ్చిన ఒక టాప్ హీరో వెళ్లారు.. ఎవరంటే అర్జున్ మాత్రమే అని తెలుస్తోంది.. ఎవరు పట్టించుకోకపోయినా అర్జున్ మాత్రం రావడంతో అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. దీంతో కొంతమంది జర్నలిస్టులు అర్జునుని డైరెక్ట్ గా అడిగేసారట.. అందుకు అర్జున్ మాట్లాడుతూ కొద్దిరోజుల ముందు సిల్క్ స్మిత తో షూటింగ్ చేసాము అయితే చివరి రోజు అర్జున్తో నేను మరణిస్తే చూడడానికి వస్తారా అని అడిగిందట.. అందుకు అర్జున్ అదే మాట అని తేలిగ్గా తీసుకున్నారని తెలిపారు. కానీ ఆ విషయం సీరియస్ గా తీసుకోలేదని తెలియజేసినట్లు సమాచారం. అందుకే అర్జున్ చివరిసారిగా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.