సంక్రాంతి సినిమాల నుంచి శృతి హాస‌న్ కు వ‌చ్చింది మ‌రీ అంత త‌క్కువా?

ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. `వాల్తేరు వీరయ్య` మరొకటి. వీర సింహారెడ్డి సినిమాలో న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ హీరోగా నటించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తే బాబీ దర్శకత్వం వహించాడు.

ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. అయితే రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబట్టాయి. టాక్ తో సంబంధం లేకుండా ఈ రెండు చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. ఇక‌ ఈ రెండు సినిమాల ద్వారా శృతి హాసన్ కు వచ్చిన రెమ్యున‌రేషన్ ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది.

ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాల‌కు కలిపి ఓకే అమౌంట్ కు శృతిహాసన్ ను మాట్లాడుకున్నార‌ట‌. అదెంత అంటే రూ. 5 కోట్లు అని తెలుస్తోంది. రెండు సినిమాలకు కలిపి శృతిహాసన్ అందుకున్న ఈ రెమ్యునరేషన్ చాలా తక్కువ‌. అయితే అటు వీర సింహారెడ్డి, ఇటు వాల్తేరు వీరయ్య‌లో శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కేవలం పాటలకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐదు కోట్ల రూపాయల‌తో ఆమెకు మైత్రి వారు సెటిల్ చేశారని టాక్.